భారత దేశంలో పండగలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగల్లో దసరా కూడా ఒకటి. కాగా.. ఈ దసరా పండగను అంగరంగ వైభంగా తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. గణేష్ చతుర్థి తర్వాత.. అదేవిధంగా మండపాలు ఏర్పాటు చేసి.. అమ్మవారిని రోజు కో రీతిలో అలంకరించి.. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 

అక్టోబరు 17 నుంచి నవరాత్రులు ప్రారంభకానున్న నేపథ్యంలో 9 రోజుల పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు పితృ పక్షం ప్రారంభమైన నెల తర్వాత ప్రారంభం కానుంది. నవరాత్రి అంటే 9 రాత్రులు అని అర్థం. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. అక్టోబరు 17 నుంచి 25 వరకు ఉంటుంది. ఈ నెల 25న దసరా లేదా విజయ దశమి జరుపుకుంటారు. నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవి 9 రూపాలను ఆరాధిస్తారు.

పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబరు 23 అష్టమి రోజున ఉదయం 6.57 గంటలకు ప్రారంభమై అక్టోబరు 24 ఉదయం 06.53 గంటలకు ముగుస్తుంది. సంధి పూజ ముహూర్తం వచ్చేసి ఉదయం 06.34 నుంచి 07.22 మధ్యలో ఉంటుంది.

అమ్మవారి అవతారాలు..

అక్టోబరు 17, మొదటి రోజు- ప్రతిపాద, ఘటస్థాపాన, శైలిపుత్రి పూజ
అక్టోబరు 18, రెండో రోజు- ద్వితీయ, చంద్ర దర్శన, బ్రహ్మచారిణి పూజ
అక్టోబరు 19, మూడోరోజు- తృతీయ, సింధూర పూజ, చంద్రఘంటా పూజ
అక్టోబరు 20, నాలుగో రోజు- చతుర్థి, కుష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ లలిత వ్రత
అక్టోబరు 21, ఐదో రోజు- పంచమి, స్కంద మాతా పూజ, సరస్వతి ఆవాహనం
అక్టోబరు 22, ఆరో రోజు- షష్ఠి, కాత్యాయని పూజ, సరస్వతి పూజ
అక్టోబరు 23, ఏడో రోజు- సప్తమి, కాళరాత్రి పూజ
అక్టోబరు 24, ఎనిమిదో రోజు- అష్ఠమి, దుర్గాష్టమి, మహా గౌరి పూజ, సంధి పూజ, మహా నవమి
అక్టోబరు 25, తొమ్మిదో రోజు- నవమి, ఆయుధ పూజ, నవమి హోమం, నవరాత్రి పరాణ, విజయ దశమి
అక్టోబరు 29, పదో రోజు- దసరా, దుర్గా నిమజ్జనం.