Asianet News TeluguAsianet News Telugu

కలి మాయ.. ఆధునికత వెంట మనిషి పరుగులు..!

అభివృద్ధి అంటే అందలం ఎక్కడమా.. అధ:పాతాలనికి పోవడమా..? మార్పు కావాలి కానీ ఆ మార్పు వలన ప్రయోజనం కలగాలి, పరాభవం, పతనం కాదు. అభివృద్ధి అంటే ఆరోగ్యకారినిగా ఉపయోగపడాలే కాని అనారోగ్యం పాలు చేయకూడదు. 

Man totally depended on Technology
Author
hyderabad, First Published May 28, 2021, 3:08 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రస్తుత కాలంలో ఆధునికత పేరుతో మనిషి ఎలాంటి వాడు ఎలా మారుతున్నాడో ఆలోచిస్తే వింతగా విడ్డురంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక నానా తంటాలు పడుతున్నాడు. అభివృద్ధి అంటే అందలం ఎక్కడమా.. అధ:పాతాలనికి పోవడమా..? మార్పు కావాలి కానీ ఆ మార్పు వలన ప్రయోజనం కలగాలి, పరాభవం, పతనం కాదు. అభివృద్ధి అంటే ఆరోగ్యకారినిగా ఉపయోగపడాలే కాని అనారోగ్యం పాలు చేయకూడదు. మన పూర్వీకులు గతంలో ఎలా బ్రతికారు ప్రస్తుత కాలంలో మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం చూడండి...      

ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది

ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది

ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది

ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది

ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది

ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది

ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది

ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది

ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి

ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు

ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యాయి

అమ్మ,నాన్న, అత్త,మామ, బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్, ఆంటీ, అంకుల్ గా మారాయి

శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి

జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి

గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి

వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి

ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి  

వీధిలో మెడికల్ షాపులకు వలస కట్టాము

శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి

ముఖానికి రాసుకొనే పసుపు, మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి

పొడుగైన వాలుజాడలు పోయి కోత్తిమీర కట్టలయ్యాయి

చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి

కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు, పబ్బాలు 

వాట్సాప్ స్టేటస్ గా మారాయి

సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి

ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి

పచ్చని పొలాలు పోయి ఫ్యాక్టరీలు,  భవంతులు అయ్యాయి

కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి

ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి

మనిషిలో మంచి,  మానవత్వం పోయి మోసం, ద్వేషం పెరిగాయి

సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది 

డబ్బే పరమావధిగా, వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు

నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగేది..

నేటి మనిషి జీవితం ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్యంతో సాగుతోంది..

ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము. ఏమి జీవితం ఇది.... సుఖసంతోషాలు లేవు. ఆనందోత్సాహాలు అంతకన్నా లేవు. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరుకే అనలేదు. గతకాలన్ని గుర్తుచేసుకుందాం ..విజ్ఞతతో జీవిద్దాం. ఆప్యాయతలు, అనుబంధాలను గౌరవిద్దాం.. సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుదాం.. గౌరవిద్దాం ..మనం ఆచరిద్దాం భావితరాల వారికి వారదులమౌదాం జై శ్రీమన్నారాయణ. 


 

Follow Us:
Download App:
  • android
  • ios