Asianet News TeluguAsianet News Telugu

Sankranthi 2022: గంగానదిలో పవిత్ర స్నానాలు రద్దు..!

హర్ కీ పౌరీ ప్రాంతంలో  ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఆ ప్రాంతాల్లో.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం గమనార్హం. రాత్రి 10 గంటల నుండి జనవరి 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు

Makar Sankranti 2022: No holy dips in Ganga in Haridwar, night curfew imposed
Author
Hyderabad, First Published Jan 11, 2022, 12:34 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్.. వేంగా దూసుకువస్తోంది. ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్.. ఉత్తరాఖండ్  లో విజృంభిస్తోంది. దీంతో.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. మకర సంక్రాంతికి హరిద్వార్ లో కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.

జనవరి 14న వచ్చే మకర సంక్రాంతి రోజున భక్తులు పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే.. ఈ సారి కరోనా కేసుల కారణంగా.. గంగా నది పవిత్ర స్నానాలు చేయడాన్ని నిషేధించారు. హర్ కీ పౌరీ ప్రాంతంలో  ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఆ ప్రాంతాల్లో.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం గమనార్హం. రాత్రి 10 గంటల నుండి జనవరి 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  డేటా ప్రకారం, భారతదేశం 1,68,063 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లను నమోదు చేసింది, మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,58,75,790కి చేరుకుంది, ఇందులో ఓమిక్రాన్ వేరియంట్  కేసులు 4,461 నమోదు కావడం గమనార్హం.

క్రియాశీల కేసులు 8,21,446కి పెరిగాయి, ఇది 208 రోజులలో అత్యధికం, మరణాల సంఖ్య 277. ఈ తాజా మరణాలతో 4,84,213కి చేరుకుంది.

ఇదిలా ఉండగా, కర్ణాటకలో కూడా సంక్రాంతికి ఎలాంటి సడలింపులు ఉండవు. కర్ణాటకలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను ఉటంకిస్తూ, తక్కువ సానుకూలత రేటు ఉన్న ప్రదేశాలలో పరిమితులను సడలించడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం తోసిపుచ్చారు. బదులుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios