maha shivaratri: నవగ్రహాలకు, శివుడికి ఉన్న సంబంధం ఏంటి? నవగ్రహాల చుట్టూ తిరిగితే ఏమౌంతుంది?
maha shivaratri:నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లో కనిపిస్తూ ఉంటారు. దేవుడిని దర్శించుకున్నాక ఖచ్చితంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటారు. జాతకంలో ఎలాంటి దోషాలున్నా అవన్నీ తొలగిపోవాలని నవగ్రహారాధన చేస్తుంటారు. శివాలయాల్లో ఉండే నవగ్రహాలే పవర్ ఫుల్ హా..?
maha shivaratri: వ్యక్తుల జాతకాలన్నీ నవగ్రహాల స్థానాన్ని బట్టే నిర్ణయించబడతాయిని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. నవగ్రహాల పొజీషన్లు మంచిగా ఉంటే ఆ వ్యక్తికి ఎటువంటి సమస్య రాదు. అదే నవగ్రహాల పొజీషన్ మంచిగా లేదనుకో మీ పరిస్థితి దారుణంగా మారిపోతాయట.
బంధాలు, బంధుత్వాలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, ఆయుష్షు వంటివన్నీ నవగ్రహాలపైనే ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నవగ్రహాల సంచారంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న మాట. నవగ్రహాల్లో ఏ గ్రహం సంచారం మంచిగ లేకపోయినా.. చాలా మంది దోశనివారణ పూజలు చేసి వాటిని శాంతింపజేస్తుంటారు. దీనివల్ల వారి జాతకం బాగుంటుందని. ఒకప్పుడు శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లోనే నవగ్రహాలు ఉండేవి. ఇప్పుడు అందరికీ వీలుగా అన్ని ఆలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
శివుడికి నవగ్రహాలకు ఉన్న సంబంధం ఏమిటీ?
గ్రహాలకు మూలం సూర్యుడు. సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. అంతేకాదు ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ కారణం చేతనే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లో ఉంటాయి.
పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయట. అందుకే ఇతర ఆలయాల్లో కంటే శివాలయాల్లోనే నవగ్రహాలు ఎక్కువగా దర్శనిమిస్తాయి. శివాలయాల్లో ఉండే నవగ్రహాలే చాలా పవర్ ఫుల్ అని పండితులు చెబుతున్నారు.
శనివారానికి త్రయోదశి కలిసొస్తే.. ఆ రోజు ఎంతో పవర్ ఫుల్ అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే శనివారం ఎంతో విశిష్టమైంది. ఆ రోజు పరమేశ్వరునికి పూజలు, అభిషేకాలు చేస్తే.. ఎన్నో దోషాలు తొలగిపోతాయని శాస్ట్రాలు చెబుతున్నాయి.
నవగ్రహారాధన చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. అప్పుడే పూజా ఫలం దక్కుతుంది. నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు వాటిని చేతితో తాకకూడదట. అలాగే నవగ్రహాలను దర్శించుకునే కంటే ముందే సూర్య దేవుడిని చూస్తూ గుడి లోపలికి అడుగుపెట్టాలి. నవగ్రహాల చుట్టూ ఖచ్చితంగా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయాలట. ఇక గుడి నుంచి బయటకు వచ్చే టప్పడు నవగ్రహాల పేర్లను మనసులో మననం చేసుకుంటూ రావాలి.