Asianet News TeluguAsianet News Telugu

జన్మాష్టమి 2022: కృష్ణాష్ణుడికి ఇవి అందిస్తే.. వారి విజయం దక్కుతుంది..!

ఈ కృష్ణాష్టమి రోజున మనం ఆయనకు ఐదు రకాల ఈ వస్తువులను అందించడం వల్ల.. మన జీవితంలో ప్రేమ, విజయం లభిస్తుందని నమ్ముతుంటారు. అవేంటో ఓసారి చూద్దాం...
 

Krishna Janmashtami 2022: 5 Things You Should Offer Lord Krishna For Love and Success
Author
Hyderabad, First Published Aug 19, 2022, 1:53 PM IST


నేడు కృష్ణాష్టమి. నేడు.. ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు.   కృష్ణుడు ప్రేమ కి చిహ్నం, ఆయన చిలిపి అల్లరిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రేమికులందరికీ ఆయనే  ఆదర్శం. ప్రతి ఆడపిల్లా కృష్ణుడు లాంటి భర్త రావాలని కోరుకుంటుంది. ప్రతి తల్లీ.. అలాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటుంది. తమకు పుట్టిన కుమారుడికి కూడా కృష్ణుడు వేషం వేసి మురిసిపోతూ ఉంటారు.  

శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రంతో జన్మించాడు. కాబట్టి ఈ జన్మాష్టమి రోజున కృష్ణుడు తమ జీవితాల్లోకి అడుగుపెట్టాలని వారు కోరుకుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున మనం ఆయనకు ఐదు రకాల ఈ వస్తువులను అందించడం వల్ల.. మన జీవితంలో ప్రేమ, విజయం లభిస్తుందని నమ్ముతుంటారు. అవేంటో ఓసారి చూద్దాం...


వెన్న : శ్రీకృష్ణుని చిన్ననాటి కథలు వెన్నకు సంబంధించిన ఆసక్తికరమైన సంఘటనలతో నిండి ఉన్నాయి. శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన వాటిలో ఇది ఒకటి. ఇది భక్తుడు, భగవంతుని మధ్య అందమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణునికి వెన్న నైవేద్యాన్ని సమర్పించడం వలన ఒకరి మేధో సామర్థ్యం పెరుగుతుంది. జీవితంలో ప్రేమ లభిస్తుంది.

మఖానా: మఖానా ఖీర్ శ్రీకృష్ణుడికి ఇష్టమైన తీపి పదార్థం. జీరో న్యూమరాలజీ సూత్రాల ప్రకారం, మఖానాను బృహస్పతి, శుక్రుడు పరిపాలిస్తారు. దానిని శ్రీకృష్ణుడికి సమర్పించడం వల్ల జీవితంలోని ప్రతి అంశంలో వ్యక్తికి పేరు, కీర్తి , శ్రేయస్సు లభిస్తుంది.

రక్ష సూత్రం: పేరు సూచించినట్లుగా, ఇది ఒక వ్యక్తికి దైవిక రక్షణను అందించే పవిత్రమైన రక్షణ తంతు. మహాభారతంలో, ద్రౌపది శ్రీకృష్ణుడికి గుడ్డ ముక్కను (రక్షా సూత్రం రూపంలో) కట్టింది. దానిని శ్రీకృష్ణునికి సమర్పించడం వలన శ్రీకృష్ణునితో సంబంధం ఏర్పడుతుంది. జీవితంలో ఆశ లేనప్పుడు దేవుడు అన్ని పరిస్థితులలో రక్షించటానికి వస్తాడు. కాబట్టి.. కృష్ణుడికి ఈ రోజు రక్ష సూత్రాన్ని అందించాలి.

పంచామృత: పచ్చి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె , పంచదార కలిపి చేసే పవిత్ర నైవేద్యమే 'పంచామృతం'. పంచామృతాన్ని స్వామి వారికి అందించాలి. దక్షిణావర్తి శంఖంతో పాటు శ్రీకృష్ణుని అభిషేకం కూడా చేయవచ్చు. ఇంకా, శ్రీ కృష్ణుని పంచామృత అభిషేకం తరువాత, గులాబీ రేకులు , తులసి ఆకులతో కలిపిన గంగాజలంతో కూడా అభిషేకం చేయవచ్చు. శ్రీ కృష్ణునికి అభిషేకం చేయడం , శ్రీ కృష్ణుడికి పంచామృతాన్ని భోగ్‌గా సమర్పించడం వల్ల వారికి జీవితంలో కోరకున్నవన్నీ లభిస్తాయి.

పసుపు పండ్లు, దుస్తులు : పసుపు రంగు ప్రధానంగా బృహస్పతి పాలిస్తుంది.  బృహస్పతి ఒక వ్యక్తి జీవితంలో మేధో సామర్థ్యం, జ్ఞానానికి బాధ్యత వహిస్తాడు. జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణునికి పసుపు పండ్లు , వస్త్రాలు సమర్పించడం వలన వ్యక్తి ఉద్యోగ , వ్యాపారాలలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. మామిడి, అరటి వంటి పసుపు పండ్లను , పసుపు ధోతి, పసుపు శల్యం వంటి పసుపు  రంగు దుస్తులను  శ్రీకృష్ణునికి సమర్పించవచ్చు.

పూజ తర్వాత, ఇదే వస్తువులను చిన్న పిల్లలకు దానం చేయవచ్చు. ఇది వ్యక్తిగత జీవితంలో దాని సానుకూల ఫలితాలను పెంచుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios