కార్తీక మాసం 2023: ఎప్పటినుంచి ఎప్పటిదాకా, విశిష్టమైన రోజుల వివరాలు

దీపావళి వెళ్లిన మరసటి రోజు కాకుండా రెండో రోజు అది సాధ్యమవుతోంది. దానికి తోడు  కార్తీక స్నానాలు ఆచరించేది బ్రహ్మమూహూర్తంలోనే. కాబట్టే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది.

Kartika Masam 2023: Date, Puja Rituals and Significance ram

హిందువులకు కార్తీక మాసం చాలా విశిష్టమైనది. కార్తీక పురాణం ప్రకారం ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం . శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తీకమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినంగా భావిస్తూంటారు భక్తులు. అంతేకాదు ఈ కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి.ఈ నెల అంతా కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని మన పెద్దలు చెప్తూంటారు. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం సహా కార్తీకమాసంలో ఎన్నో  ముఖ్యమైన రోజులు ఉన్నాయి.

ప్రతీ సంవత్సరం సాధారణంగా దీపావళి వెళ్లిన మరుసటి రోజే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా మార్పు చోటు చేసుకుంది. ఎందుకంటే కార్తీక శుద్ద పాధ్యమికి  సూర్య స్పర్శ (అనగా సూర్యోదయం)కలిగి ఉండాలి. కానీ దీపావళి మరుసటి రోజు అలా జరగటం లేదు.  దీపావళి వెళ్లిన మరసటి రోజు కాకుండా రెండో రోజు అది సాధ్యమవుతోంది. దానికి తోడు  కార్తీక స్నానాలు ఆచరించేది బ్రహ్మమూహూర్తంలోనే. కాబట్టే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది. 

విశిష్ట తేదీల విషయానికి వస్తే...

కార్తీకంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశె పూలు, మల్లె, గరిక తదితరాలతో పాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. కార్తీకమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తీక పురాణం వివరిస్తోంది.
 
• నవంబరు 15 బుధవారం యమవిదియ - భగినీహస్త భోజనం

• నవంబరు 17 శుక్రవారం నాగుల చవితి

• నవంబర్ 18 శనివారం నాగ పంచమి

• నవంబరు 20 కార్తీకమాసం మొదటి సోమవారం 

• నవంబరు 23 ప్రబోధన ఏకాదశి

• నవంబరు 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి

• నవంబరు 26 ఆదివారం జ్వాలా తోరణం

• నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ  

• డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం

• డిసెంబరు 11 కార్తీకమాసం నాలుగో సోమవారం

• డిసెంబరు 13 బుధవారం పోలి స్వర్గం

కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెబుతారు. లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు.
  
కార్తీకమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి.  పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. ఈ కార్తీకంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుంది. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. 

--
జోశ్యుల రామకృష్ణ 
 ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు
.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios