Asianet News TeluguAsianet News Telugu

గృహప్రవేశానికి అనుకూలమైన మాసం..!

ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో పూర్ణిమ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని. 

Karthika masam best for House warming
Author
Hyderabad, First Published Nov 16, 2021, 2:08 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదే సమయంలో కార్తీక, మార్గశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.

ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో పూర్ణిమ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని. 

* దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. 

* ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.

* దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశి తిథులు మంచివి. 

* తూర్పు, ఉత్తర సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, 

* పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశి తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

* సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం, కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios