Asianet News TeluguAsianet News Telugu

Janmashtami 2022: శ్రీ కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో తెలుసా?

శ్రీ కృష్ణుడు అలంకార ప్రియుడు. ఈ విషయం మనకు తెలిసిందే . ఆయన అలంకారం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. చిన్న నెమలిని చూసినా కృష్ణుడు గుర్తుకు వస్తాడు, వేణువు చూసినా గుర్తుకొస్తాడు.

Janmashtami 2022 Why Lord Krishna Wear Peacock Feathers
Author
hyderabad, First Published Aug 18, 2022, 3:30 PM IST

శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి కృష్ణుడి పుట్టినరోజు. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో భూమిపై అవతరించిన శుభదినం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు గోకులాష్టమి పండుగను అత్యంత వైభవంగా , కోలాహలంగా జరుపుకుంటారు.

శ్రీ కృష్ణుడు అలంకార ప్రియుడు. ఈ విషయం మనకు తెలిసిందే . ఆయన అలంకారం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. చిన్న నెమలిని చూసినా కృష్ణుడు గుర్తుకు వస్తాడు, వేణువు చూసినా గుర్తుకొస్తాడు.
కృష్ణుడు తన నీలిరంగు శరీరంపై వైజయంతీ మాల ధరిస్తాడు. అంతేకాదు..తలపై ఎప్పుడూ నెమలి ధరిస్తారు. చేతిలో వేణువు ఉంటుంది.

వేణువు, నెమలి పింఛం లేకుండా కృష్ణుని రూపం అసంపూర్ణం. గ్రంధాల ప్రకారం, విష్ణువు అవతారాలలో నెమలి కిరీటం ధరించిన వ్యక్తి కృష్ణుడు మాత్రమే. అసలు కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో తెలుసా..?

రాధ ప్రేమకు ప్రతీక
కన్నయ్యకు రాధపై ఉన్న ఎనలేని ప్రేమకు చిహ్నంగా నెమలి పింఛాన్ని ధరిస్తారట. నమ్మకాల ప్రకారం, ఒకసారి రాధ  నృత్యం చేస్తుంటే, నెమళ్ళు కూడా రాజభవనంలో ఆమెతో నృత్యం చేయడం ప్రారంభించాయి. ఈ సందర్భంలో నెమలి ఈక కింద పడిందట. శ్రీకృష్ణుడు వెంటనే దానిని తీసుకొని తన తలలో పెట్టుకున్నాడట. అప్పటి నుంచి రాధ ప్రేమకు చిహ్నంగా కృష్ణుడు ఈ నెమలిని ధరిస్తాడని కొందరి నమ్మకం.


కాలసర్ప యోగం
నెమలి , పాము మధ్య శత్రుత్వం ఉంది. ఈ కారణంగానే కాలసర్ప యోగం అనే అశుభ యోగం ఉన్నప్పుడు నెమలి ఈకలను మీ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. శ్రీ కృష్ణుడికి కాలసర్ప యోగం కూడా ఉంది. కాబట్టి ఆ దోష ప్రభావాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు ఎప్పుడూ నెమలి ఈకను తన దగ్గర ఉంచుకుంటాడని కొందరు నమ్ముతారు.

శత్రువులకు కూడా ప్రత్యేక స్థానం ఉంది
శ్రీ కృష్ణుడి అన్న బలరామ శేషనాగ అవతారం. నెమలి, నాగ ఒకరికొకరు శత్రువులు. కానీ కృష్ణుడి నుదుటిపై ఉన్న నెమలి ఈక శత్రువులకు కూడా ప్రత్యేక స్థానం కల్పించాలనే సందేశాన్ని ఇస్తుంది.


నెమళ్లు వర్షాకాలంలో వర్షం, నృత్యాన్ని ఇష్టపడతాయి. ఆకాశం పూర్తిగా నల్లటి మబ్బులతో కప్పినప్పుడు నెమలి చూసి సంతోష పడుతుందట.అదేవిధంగా, కృష్ణుడు ముదురు రంగులో ఉన్నందున, చీకటి, వర్షం-భారీ మేఘాలను పోలి ఉంటాడు. నెమళ్లు శ్రీకృష్ణుడిని చూడగానే వర్షం గుర్తుకొచ్చి ఆనందంతో నాట్యం చేస్తాయి. ఆ  కృతజ్ఞతగా.. కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడట.


ప్రకృతి రంగు
నెమలి పింఛంలో ప్రకృతి లోని మొత్తం 7 రంగులు ఉన్నాయి. ఇది పగటిపూట నీలం రంగులో, రాత్రికి నలుపు రంగులో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా ఈ రెండు రంగులనే కలిగి ఉంటాడు. అతను పగటి నీలం, రాత్రి నలుపును సూచిస్తాడు. దాని గుర్తుగా కూడా ఆయన నెమలి పింఛాన్ని ధరిస్తాడట.
 

Follow Us:
Download App:
  • android
  • ios