Asianet News TeluguAsianet News Telugu

శ్వాసప్రాధాన్యతతో ఆయుష్షును పెంచుకో

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి, వీటినే సెల్స్ అంటాం.

Increase longevity with breathing priority
Author
Hyderabad, First Published Jun 28, 2021, 9:40 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Increase longevity with breathing priority
మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు, 100 నుండి 120 సం.రాలు  బ్రతుకుతాడు. 

తాబేలు నిమిషానికి 3 సార్లు శ్వాస తీస్తుంది, 500 సం.రాలు బ్రతుకుతుంది.

ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగుతుంది దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్పదనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి, వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా (హరిత రేణువు) "అనే ప్రత్యేక కణ వ్యవస్థ'' ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీనిద్వారా ఉష్ణం జనిస్తుంది.

ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది. ఇలా శరీరంలోని కాలిగోరు నుండి తలవెంట్రుకలు చివరవరకూ ఉన్న ప్రతీ కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది.

ఇలా ఒక్కొక్క కణం నిముషానికి 15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది. ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి...

ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి,  తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది. ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి.

ఎప్పుడైతే ఒక మృతకణం బయటికి వెళ్లిందో... ఆ స్థలంలో ఒక కొత్తకణం మనం తీసుకొనే ఆహారంద్వారా తయారవుతుంది.

ఉదాహరణకు మన గుండెలో 1000 మృతకణాలు తయారయ్యాయి. అనుకుంటే... ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము, మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే... కొత్తవి రాగల్గుతాయి. అందుకే ప్రతీ దినం, మన మలవిసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మలవిసర్జన సరిగా చెయ్యరో... వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి, సరిగా ఉష్ణం జనించక, తీవ్ర రోగాల బారిన పడతారు. కనుక ఈ టాక్సిన్ లను బయటికి పంపే డిటాక్సీఫీకేషన్ (విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది. అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే... 5 రోజులు జీవిస్తుంది.

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే... 7 రోజులు జీవిస్తుంది. ఈ విధంగా మనం, శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ... మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది. 

ఎలా ఐతే ఒక యంత్రం చేత ఎక్కువ పనిచేయిస్తే... త్వరగా పాడైపోతుందో, పనితగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో.. అలాగే ఈ కణాలు కూడాను అన్నమాట.

భారతీయ యోగులు
కణం యొక్క జీవిత కాలాన్ని... 03 - 21 రోజుల వరకూ పెంచి, 2100 సంవత్సరాలు కూడా జీవించగలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ... శరీరంలోని ప్రతీ కణంపై తీవ్ర పనిఒత్తిడి పడి, ఆ కణం త్వరగా పాడైపోతుంది. 
       
ప్రాణయామసాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచగల్గితే... మన శరీరంలోని ప్రతి అవయం మరికొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది. ఎందుకంటే...... అవయవాలు అంటే కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క ఆయుష్షు పెరిగితే... మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.

మనం ఒక్క శ్వాసను తగ్గించ గల్గితే... 20 సంవత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చు.

యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే... తాము ఏ రోజు మరణించేదీ, ముందే చెబుతారు.

శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, సర్వే సుజనాః సుఖినో భవంతు.

Follow Us:
Download App:
  • android
  • ios