Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మీ నారాయణుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?

దైవాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి మనిషిలో సహజంగా ఉన్నప్పటికీ, ఎలా అనేది అంతు పట్టదు. ఆవు అనగానే ఆవురూపాన్ని ఊహించుకున్నట్లే, దైవం అనగానే ఒక వ్యక్తిగానో వస్తువుగానో మనిషి ఊహించుకుంటాడు. 

How to Get Blessings From Lord Lakshmi Narayana
Author
Hyderabad, First Published Nov 26, 2021, 4:52 PM IST

 

దైవం ఉన్నాడా అనే విషయంపై మనిషి మనసు ఎప్పుడూ సంశయాత్మకంగానే ఉంటుంది. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉంటాడు? ఈ ప్రశ్నలు సామాన్యుడినే కాదు, మేధావిని సైతం వేధిస్తూనే ఉంటాయి. ఎంత వెతికినా, ఎవరిని అడిగినా, వీటికి సరైన సమాధానం దొరకదు. రామకృష్ణ పరమహంస రూపంలో వివేకానందుడికి కలిగిన ఆ అదృష్టం, ఎవరికోగాని అందదు.

దైవాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి మనిషిలో సహజంగా ఉన్నప్పటికీ, ఎలా అనేది అంతు పట్టదు. ఆవు అనగానే ఆవురూపాన్ని ఊహించుకున్నట్లే, దైవం అనగానే ఒక వ్యక్తిగానో వస్తువుగానో మనిషి ఊహించుకుంటాడు. కంటితో ఆవును చూసినట్లే, దైవాన్ని చూడాలనుకుంటాడు. అది సాధ్యపడక, దైవం లేడని సంశయిస్తాడు. కాని తాను గ్రహించలేనివి, ఊహకు అందనివి లేవనడం సరికాదని తోస్తుంది. ఇలా తనలో తాను తర్కించుకుంటూ   విషయాలను లోతుగా పరిశీలించడం మొదలుపెడతాడు.

గురువారం నాడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. ముఖ్యంగా పసుపు సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా మీకు శుభకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు పాటించాల్సిన పసుపు నివారణలేంటో ఇప్పుడు చూద్దాం.
 
గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. గురువారం నాడు ఉపవాసం పాటించేవారు శ్రీ మహావిష్ణువును పసుపుతో పూజించి పసుపుతో తిలకం దిద్దుతారు. ఈ కారణంగా పసుపు పౌరాణిక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా పరిగణిస్తారు. పసుపు పూజలోనే కాకుండా గాయాలైతే కూడా ఉపయోగిస్తారు. యాంటీ బయోటిక్ గా వాడతారు. పసుపుకు సంబంధించి 5 అద్భుతమైన పరిహారాల గురించి ఈ రోజు మీకు తెలియజేయనున్నాం. గురువారం నాడు పసుపును ఉపయోగించడం వల్ల మీ జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.

శుభకార్యానికి వెళ్లే ముందు ఈ విధంగా చేయండి :- మీరు గురువారం నాడు ఏదైనా శుభకార్యానికి వెళ్తుంటే ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు తిలకాన్ని దిద్దండి. అనంతరం మీ నుదుటిపై పసుపుతో బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి అవరోధాలు వచ్చినా వెంటనే తొలుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా శుభఫలితాలు కూడా లభిస్తాయి.

పసుపు దానమివ్వడం :- దేవతల గురువుగా పరిగణించే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు శనగ పప్పు, పసుపు, పసుపు రంగు వస్త్రాలు, బూందీ లడ్డూ ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది. అంతేకాకుండా గురువారం నాడు ఈ పరిహారం పాటించడం వల్ల మీరనుకున్న కార్యాలు ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా సానుకూల ఫలితాలు ఉంటాయి.

​పసుపు అక్షతలు :- ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు ఈ పరిహారం పాటించాలి. చేతిలో పసుపు, అక్షతలు తీసుకొని విష్ణ సహస్రనామాన్ని పఠించాలి. ఈ కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా చేయాలి. ఇలా మనస్ఫూర్తిగా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

​వైవాహిక జీవితంలో ఆనందం కోసం :- మీ కుటుంబంలో ఆనందం ఎప్పుడు ఉండాలన్నా, మీ జీవిత భాగస్వామి(భర్త) మీతో సంతోషంగా జీవించాలన్నా ఈ పరిహారం పాటించాలి. గురువారం నాడు శరీరానికి పసుపును మర్దన చేసుకొని అనంతరం పసుపు నీళ్లతో స్నానమాచరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సుకు కొరత ఉండదు. అంతేకాకుండా మీ దాంపత్య జీవితం ఎప్పుడూ మధురంగా ఉంటుంది.

​డబ్బు కొరతను అధిగమించడానికి :- గురువారం నాడు ఐదు మూటల పసుపు తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత తీరడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు. ప్రతి నెల ఈ పసుపును పవిత్ర స్థలంలో పాతిపెట్టి, అనంతరం ఇతర పసుపు బేళ్లను ఉంచండి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios