Asianet News TeluguAsianet News Telugu

ఏడవ రోజు దుర్గాదేవికి అవతారం 'కదంబం' ప్రసాదం

శరన్నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి అవతారాన్ని కొలుస్తారు. అమ్మవారికి 'కదంబం' ప్రసాదం నివేధన చేస్తారు. 

Godess Duga devi on seventh day of Navaratri
Author
Hyderabad, First Published Oct 13, 2021, 10:40 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శరన్నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి అవతారాన్ని కొలుస్తారు. అమ్మవారికి 'కదంబం' ప్రసాదం నివేధన చేస్తారు. 

కదంబం తయారు చేయడానికి కావలసినవి పదార్ధాలు :- 

కందిపప్పు 1/2 కప్పు 

బియ్యం 1/2 కప్పు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

1 వంకాయ

1/4 సొరకాయ

1 దోసకాయ

బీన్స్ తగినన్ని

1 ఆలు 

పల్లీలు 2 పిడికిళ్ళు

2 మొక్కజొన్నలు

1/2 క్యారెట్

2 టోమాటో

తగినంత కర్వేపాకు

కొత్తిమీర

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

4 పచ్చిమిర్చి

నూనె తగినంత

నెయ్యి చిన్న కప్పు

చింతపండు గుజ్జు తగినంత

కాస్త బెల్లం 

ఉప్పు , పసుపు తగినంత

3 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము :-  ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని ఉంచుకోండి కుక్కర్లో కందిపప్పు, బియ్యం, పల్లీలు, టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి పసుపు, ఉప్పు, నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయండి. 

మూకుడులో కొద్దిగ నూనె వేడి చేసాక అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, కర్వేపాకు, టొమాటో, చింతపండు గుజ్జు , సాంబర్ పౌడర్ , బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవి అంతా ఉడికిన బియ్యంలో వేసి కొత్తిమీర, కర్వేపాకు, నెయ్యివేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందండి. 

Follow Us:
Download App:
  • android
  • ios