Asianet News TeluguAsianet News Telugu

ఏలినాటి శని పట్టిపీడిస్తోందా - దోషాలను ఇలా తొలగించుకోండి..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని న్యాయం, ప్రేమ చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. శని శాపం తగిలితే చెడు ప్రభావాలుంటాయి.

Elenati Shani How to avoid bugs?
Author
hyderabad, First Published May 29, 2021, 1:08 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Elenati Shani How to avoid bugs?

శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాలకంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. శని..బుధుడు, శుక్రుడు, రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు.

ఏలినాటి శని
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని న్యాయం, ప్రేమ చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. శని శాపం తగిలితే చెడు ప్రభావాలుంటాయి. ఈ కారణంగా శనిని పాపాపు లేదా క్రూరమైన గ్రహంగా భావిస్తారు. శని, బుధుడు, శుక్రుడు, రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. బృహస్పతి, కేతువుతో కూడా ఇలాంటే సంబంధమే ఉంటుంది. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాలకంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది.

శాస్త్రం ప్రకారం మకరం, కుంభ రాశులకు అధిపతి శని ఓ రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి లేదా బదిలీ కావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఈ విధంగా శని దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం ధనస్సు, మకరం, కుంభ రాశుల్లో ఏలిననాటి శని ప్రభావం ఉంది. ఫలితంగా ఈ రాశుల వారి జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

2022 ఏప్రిల్ 29న శని తన రాశిలో నుంచి కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల మీన రాశి వారికి ఏడున్నరేళ్ల పాటు శని ప్రభావం ఉంటుంది. ఇది మొదటి దశ మాత్రమే. మరోవైపు ధనస్సు రాశివారు ఈ ప్రభావం నుంచి దూరమవుతారు. మకరం, కుంభ రాశులపై శని ప్రభావం ఇంకా ఉంటుంది. ఈ మార్పు కారణంగా వృశ్చికం, కర్కాటక రాశుల వారికి శని ప్రభావం ప్రారంభమవుతుంది.

ఏలినాటి శని మూడు దశలు:- సాధారణంగా ఏలిశని ప్రభావం మూడు దశల్లో ఉంటుంది. ఏలిననాటి శని అనే మాట వింటేనే చాలా మంది భయపడతారు. దీనికి సంబంధించిన భ్రమలు తొలగించుకోవాలి. ఈ మూడు దశలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

మొదటి దశ :- జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏలినాటి శని మొదటి దశలో వ్యక్తి ఆర్థిక పరిస్థితి ప్రభావితమవుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి కావు. ఆర్థిక సమస్యలు కారణంగా చాలా పనులు ప్రారంభించలేరు. ఆకస్మికంగా ధననష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశముంది. పరిస్థితులు మరింత దిగజారుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలతో పాటు పనిప్రదేశంలో ఎంత కష్టపడినా మీకు ప్రయోజనం ఉండదు.

రెండో దశ :- ఏలినాటి శని రెండో దశలో కుటుంబం, వ్యాపార జీవితంలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. బంధువులు బాధపడతారు. మళ్లీ మళ్లీ సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీరు ఇల్లు, కుటుంబానికి దూరంగా ఉండాలి. ఆస్తి సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి.

మూడో దశ :-  ఏలినాటి శని ప్రభావం మూడో దశలో వ్యక్తుల భౌతిక ఆనందాలపై పడుతుంది. హక్కులు క్షీణిస్తాయి. ఆదాయం కంటే ఖర్చు అధికమవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలకు అంతరాయం కలుగుతుంది. పిల్లలతో సైద్ధాంతి వ్యత్యాసాలు ఉంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ దశలో వ్యక్తులకు పెద్దగా ఉపయోగముండదు.

శని దోషం పరిహారాలు :- శని దోషాలను నివారించడానికి రావిచెట్టు కింద నువ్వుల నూనె, ఆవనూనెతో దీపం వెలిగించాలి. ప్రతి రోజు రావిచెట్టుకు '11' ప్రదక్షిణలు చేస్తూ " ఓం నమో భగవతే వాసుదేవాయ" అని స్మరిస్తూ నిధానంగా ప్రదక్షిణలు చేయాలి.

విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. హనుమంతుడిని ఆరాధించాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా లేదా సుందరకాండను పారాయణం చేయాలి. ఆంజనేయుడిని ఆరాధించడం ద్వారా శనిదోష నివృత్తి జరుగుతుంది. 

పరమేశ్వరుడిని ఆరాధించడం ద్వారా కూడా శనిదేవుడి సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే శివుడు శని దేవుని గురువు. ఆయనను ఆరాధించడం వల్ల శనిదోషం తీవ్ర ప్రభావ స్వభావాన్ని తగ్గుతాడు. శనివారం శనిదేవుడికి సంబంధించి వస్తువులను నువ్వులు, నూనె, పత్తి, కాటన్ వస్త్రాలు, ఇనుప ఫర్నిచర్, లెదర్ ( తోలు ) చేయబడిన వస్తువులు దానం చేయాలి. 

పై అన్నింటి కన్ననూ.. ముఖ్యంగా పేదలకు, పశుపక్ష్యాదులకు ఆకలి తీరిస్తే చాలా చాలా అద్బుతమైన శుభ ఫలితాలు శని దేవుడు ప్రసాదిస్తాడు. అమ్మనాన్న, వృద్దులకు, వికలాంగులకు, అనాధలకు నిస్సహాయ స్థితిలో ఎవరు ఉన్నా వారికి మీకు చేతనైన సహాయం చేయగలిగితే శని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది మనం చేసే సత్కార్యాలు సమాజానికి తెలిసేలా తాపత్రయపడుతూ చేస్తే ఫలితం శూన్యం అవుతుంది. గోప్యంగా, నిరాడంబరంగా చేయండి శుభాలను పొందండి.  

Follow Us:
Download App:
  • android
  • ios