Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏడాది రంజాన్ పండగ ఎప్పుడొచ్చిందో తెలుసా.?

ఈ రంజాన్ పండగను పశ్చిమ దేశాలలో గురవారం( మే13)న జరుపుకుంటారు. ఇక భారత్ , ఇతర ఆసియా దేశాలు బుధవారం నెలవంక కోసం ఎదురు చూస్తారు.

Eid-ul-Fitr 2021: Date, significance and celebration
Author
Hyderabad, First Published May 12, 2021, 10:25 AM IST

ముస్లిం సోదరులు జరుపుకునే అతి పెద్ద పండగ రంజాన్.  ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగను నెలవంక ఆధారంగా.. నిర్ణయించారు.మరి ఈ ఏడాది రంజాన్ ఏ రోజు వచ్చింది..? అసలు ఈ పండగ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

రంజాన్ పండగకు ముందు నెల రోజుల నుంచి.. ముస్లిం సోదరులు రంజాన్ మాసం జరుపుకుంటారు. దాదాపు నెలరోజులపాటు ఉదయం  నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజూ అల్లాకి ప్రార్థనలు చేశారు. అందుకే.. ఈ మసాన్ని ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర మాసంగా భావిస్తారు. ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలో పాల్గొంటారు.

ఈ రంజాన్ పండగను పశ్చిమ దేశాలలో గురవారం( మే13)న జరుపుకుంటారు. ఇక భారత్ , ఇతర ఆసియా దేశాలు బుధవారం నెలవంక కోసం ఎదురు చూస్తారు. నెలవంక ఈ రోజు కనిపిస్తే.. గురువారం.. లేదా శుక్రవారం ఈ పండగను జరుపుకుంటారు. నెలవంక కనిపించిన తర్వాతి రోజున ఈ పండగను జరుపుకుంటారు.

ఇస్లామిక్ క్యాలెండర్ సౌర కాకుండా చంద్ర చక్రాన్ని అనుసరిస్తుంది, అందువల్ల చంద్రుడిని చూడటం చాలా ముఖ్యం. చంద్రుడి కనపడిన తర్వాతే వారు పండగ జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఒక సమ్మేళన మసీదులో ఉదయం ఈద్ ప్రార్థన చేస్తారు, ఈ సంవత్సరం COVID విపరీతంగా ఉన్న నేపథ్యంలో..  అనేక కుటుంబాలు ఇంట్లో ప్రార్థనలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ రోజున వారంతా కొత్త దుస్తులు ధరిస్తారు. కుటుంబసభ్యులకు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు.

ఈ సందర్భంగా  రుచికరమైన ఆహార పదార్థాలు కూడా తయారుచేస్తారు. భారత ఉపఖండంలో, చాలా కుటుంబాలు ఈద్ కోసం సెవాయిన్ అనే తీపి వంటకాన్ని తయారు చేస్తాయి. రకరకాల వంటలను ఆరగిస్తారు. ఆ రోజుతో వారి ఉపవాస దీక్ష ముగుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios