అన్నపూర్ణా దేవి అవతారంలో అమ్మవారు..నైవేద్యంగా కొబ్బరన్నం..!

శరన్నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణా దేవి అవతారం నైవేద్యంగా కొబ్బెరన్నం నివేదన చేస్తారు. 
 

Dussehra Navaratri: Godess Dura devi in Annapurna devi

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శరన్నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణా దేవి అవతారం నైవేద్యంగా కొబ్బెరన్నం నివేదన చేస్తారు. 


కొబ్బెరన్నం తయారు చేయుటకు కావలసిన పదార్ధాలు :-

బియ్యం 1/2 కిలో

తురిమిన పచ్చికొబ్బెర 1 కప్పు

పచ్చిమిర్చి 5

కర్వేపాకు, కోత్తిమిర, ఉప్పు

పోపు సామాగ్రి ఎండుమిర్చి, ఇంగువ.

జీడిపప్పు 10

నూనె , 1/4 కప్

నెయ్యి 1 టెబల్ స్పూన్

తయారు చేయవలసిన పద్ధతి:-

* అన్నం పోడి పోడిగా వండుకొని పచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి.

* అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి, ఇంగువ, వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు, కర్వేపాకు, కోత్తమిర అందులో వేసి తీసేయండి. 

* ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పు కూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి.

శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులమవుదాము.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios