గణేశుడిని పూజించేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..!

ఈ రోజున పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల వినాయకుడికి  కోపం వస్తుంది. అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి, గణేశ పూజలో ఈ వస్తువులను సమర్పించవద్దు.
 

Do not make the mistake of offering these 5 things to Ganesha ram


హిందూ మతం ప్రకారం, వారంలో ఏడు రోజులు వివిధ దేవుళ్లకు అంకితం చేస్తారు. బుధవారం వినాయకుని రోజు. వినాయకుడిని విఘ్నకర్త  అనే పేర్లతో పిలుస్తారు. హిందూమతంలో ఏ శుభ కార్యమైనా గణేశ పూజతో ప్రారంభమవుతుంది. బుధవారాలలో గణపతిని మనస్పూర్తిగా పూజించడం వలన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడంతోపాటు భక్తులకు సకల బాధలు తొలగిపోతాయి. కానీ దీనికి విరుద్ధంగా, ఈ రోజున పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల వినాయకుడికి  కోపం వస్తుంది. అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి, గణేశ పూజలో ఈ వస్తువులను సమర్పించవద్దు.

చంద్రునికి సంబంధించిన వస్తువులను అందించవద్దు
ఒకసారి చంద్రుడు గణేశుడిని ఎగతాళి చేయగా, వినాయకుడు కోపించి చంద్రుడిని తన అందాన్ని కోల్పోవాలని శపించాడు. అందుకే గణేశ పూజలో తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లటి పవిత్ర దారం మొదలైన వాటిని సమర్పించరు. మీరు అతనికి ఎరుపు లేదా పసుపు చందనం సమర్పించవచ్చు.


తులసి
తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. గణేశ పూజలో తులసి ఆకులను ఉపయోగించవద్దు. పురాణాల ప్రకారం, తులసి వివాహ ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన తులసి గణేశుడికి ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు చేస్తానని శపించింది. ఆ తర్వాత గణేశుడు తులసిని నువ్వు అసురుడిని పెళ్లి చేసుకుంటావు అని శపించాడు. దీని తరువాత, గణపతి పూజలో తులసిని సమర్పించడం నిషిద్ధంగా పరిగణించారు.

కేతకి పుష్పాలు
గణేశుడికి తెల్లటి పూలు, కేతకీ పుష్పాలు సమర్పించవద్దు. పురాణాల ప్రకారం, శివుడికి కేతకి పుష్పాలు అంటే ఇష్టం ఉండదు. అందుకే కేతకీ పుష్పాలను గణేశుడికి సమర్పించకూడదు. అలాగే ఎండిన పువ్వులు సమర్పించడం కూడా అశుభం.

ఎండిన పువ్వులు
గణేశ పూజలో పొడి, పాత పువ్వులను సమర్పించవద్దు. ఎండిన పువ్వులను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం పెరుగుతుంది. కాబట్టి, పూజ సమయంలో వినాయకుడికి తాజా పుష్పాలను సమర్పించండి.

గణేశుడికి ఏమి సమర్పించాలి?
గణపతికి దుర్వేని సమర్పించాలి. అలాగే పచ్చి పసుపు, లడ్డూలు, మోదకాలు, పసుపు పూలు, వస్త్రాలు సమర్పించండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios