దీపావళి 2023: లక్ష్మీదేవి పూజ ఇలా చేయండి

Diwali 2023: దీపావళి పండుగను హిందూమతంలో ఎంతో ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేనిని పూజించే వారి కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ దీపావళి నాడు లక్ష్మీదేవికి ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

 diwali 2023: worship lakshmi with this method know the puja time rsl

Diwali 2023: సనాతన ధర్మంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి పూజ లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణం. అయితే అమ్మవారి అనుగ్రహం పొందడానికి పూజను నియమాల ప్రకారం చేయాలి. దీపావళి నాడు పూజ ముహూర్తం ప్రకారం.. సాయంత్రం పూట లక్ష్మీపూజ చేయాలి. దీపావళి పర్వదినాన అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ రోజు దీపావళి కాబట్టి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్మీ పూజ తేదీ, సమయం

అమావాస్య తిథి ప్రారంభం - నవంబర్ 12-  02:44

అమావాస్య తిథి ముగింపు - నవంబర్ 13, 02:56

లక్ష్మీ పూజ ముహూర్తం - నవంబర్ 12 సాయంత్రం 05:19 నుంచి 07:19 వరకు

లక్ష్మీ పూజ విధి

  • ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించాలి.
  • ఇంటితో పాటుగా ఆలయాన్ని కూడా శుభ్రం చేయాలి. 
  • అలాగే ఇంటిని పూలు, దీపాలు, రంగోలితో అలంకరించాలి. 
  • కొత్త, శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. లక్ష్మీదేవి పూజ కోసం అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. 
  • చాలా మంది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. 
  • సాయంత్రం చెక్క టేబుల్ పై శ్రీ యంత్రం, గోపాలుడితో పాటుగా వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
  • ఈ రోజు 21 మట్టి దీపాలు వెలిగించాలి. 11 తామర పువ్వులు, తమలపాకు, లవంగాలు, వివిధ రకాల స్వీట్లు, ఖీర్ లను సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేయాలి. 
  • ముందుగా వినాయకుడికి, లక్ష్మీదేవికి తిలకం పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  • ఈ రోజు  మీ నగలను, డబ్బును లక్ష్మీదేవి ముందు పెట్టి అంతా మంచే జరగాలని ప్రార్థించండి. 
  • పూజ చివరిలోలక్ష్మీదేవికి, వినాయకుడికి హారతినివ్వండి. 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios