Asianet News TeluguAsianet News Telugu

దీపావళి 2023: వాస్తు ప్రకారం.. దీపావళి నాడు ఏ దిక్కున దీపాలను వెలిగిస్తే మంచిదంటే?

Diwali 2023: ఇంట్లో పాజిటీవ్ ఎనర్జీ ఉంటేనే ఇంట్లో అంతా సక్రమంగా ఉంటుంది. వాస్తు ప్రకారం.. దీపావళి నాడు కొన్ని దిక్కుల్లో దీపాలను వెలిగిస్తే ఇంట్లోని నెగిటీవ్ ఎనర్జీ పోయి పాజిటీవ్ ఎనర్జీ వస్తుందని. ఇందుకోసం ఏ దిక్కున దీపాలను వెలిగించాలంటే? 

Diwali 2023:  know the right direction to light diyas this diwali and attract positive energy
Author
First Published Nov 4, 2023, 11:47 AM IST

Diwali 2023: దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లలో దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ దీపాలు కూడా ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని తొలగించి పాజిటీవ్ ఎనర్జీని తీసుకొస్తాయంటారు జ్యోతిష్యులు. అయితే ఇందుకోసం కొన్ని దిక్కుల్లో ఖచ్చితంగా దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఇవి మీ ఇంటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. ఇవి ప్రతికూల శక్తులను తొలగించడానికి సహాయపడతాయి. ఈ పద్దతులను పాటించడానికి మీ జాతకం, నక్షత్రంతో పనిలేదు. ముఖ్యంగా మీ ఇంటికి లక్ష్మీదేవి  రాక ఉండాలటే దీపాలను కొన్ని దిక్కుల్లో ఖచ్చితంగా పెట్టాలంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ దిక్కుల్లో దీపాలను వెలిగించాలంటే?

దీపావళి సందర్భంగా దీపాలను వెలిగించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వాస్తు ప్రకారం.. స్వచ్ఛమైన దేశీ నెయ్యి దీపాలను వెలిగించడం శుభప్రదం. ఇంటీ ఇంటి ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతి మూలల్లో దీపాలను వెలిగిస్తే మంచిది చెప్తున్నారు. అయితే ఈ దీపాలను ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు ప్రతి రోజూ కనీసం ఒక గంట పాటైనా దీపాలను వెలిగించాలి. ఇవి పండుగ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా మీ భక్తిని కూడా పెంచుతాయి. అలాగే లక్ష్మీదేవిని సంతోషింపజేస్తాయి. అలాగే మీ ఇంట్లోనే నెగిటీవ్ ఎనర్జీ పొయ్యేలా చేస్తాయి.

ఉత్తరం, దక్షిణ దిశలో దీపాలు

మీ ఇంటి ఉత్తరం వైపున షార్ట్ బర్నింగ్ కొవ్వొత్తులను వెలిగించండి. అలాగే ఎక్కువ సేపు మండే దీపాలను మీ ఇంటి దక్షిణం వైపున వెలిగించండి. ఇవి ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తాయి. 

ప్రవేశ ద్వారం వద్ద ముగ్గులు

దీపావళి నాడు ఇంటి ప్రధాన గుమ్మం ముందు రంగులతో అందమైన ముగ్గులను వేసే సాంప్రదాయం కూడా ఉంది. అందమైన ముగ్గు మధ్యలో కూడా దీపాలను వెలిగిస్తారు. ఇది మీ ఇంటిని అందంగా మార్చడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ ముగ్గుకు నిర్ధిష్ట రంగులను మాత్రమే ఉపయోగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios