దివాళి2022: దీపావళికి లక్ష్మీ దేవితో పాటు విష్ణుమూర్తిని ఎందుకు పూజించరు..?
లక్ష్మీదేవిని, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. లక్ష్మీపూజ చేస్తే ఆర్థిక లోటు ఉండదని నమ్మకం.
దీపావళి అంటే దీపాల పండగ. ఈ పండగ రోజున మనం దేశం మొత్తం వెలుగులతో నిండి ఉండటం చూడొచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని దీపాలతో అలంకరించుకుంటారు. ఈ నెల 24వ తేదీన మనం దీపావళిని జరుపుకుంటున్నాం.
ఐదు రోజుల పాటు జరిగే దీపావళిలో లక్ష్మీపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున లక్ష్మీ దేవితో పాటు, గణేశుని పూజిస్తారు. రాత్రి వేళల్లో లక్ష్మీదేవిని, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. లక్ష్మీపూజ చేస్తే ఆర్థిక లోటు ఉండదని నమ్మకం. జీవితంలోని కీర్తి లోపాన్ని పోగొట్టుకోవడానికి లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మిదేవి గణేశుడు కాకుండా, కొన్ని ప్రదేశాలలో కుబేరుడు, తల్లి సరస్వతి దేవి, కాళీ దేవిని కూడా పూజిస్తారు.
లక్ష్మీ దేవి అనగానే మనకు విష్ణు మూర్తి కూడా గుర్తుకువస్తాడు. సాధారణంగా లక్ష్మి పూజ చేస్తే విష్ణు, విష్ణువున పూజ చేస్తే లక్ష్మి దేవి ఉండటం చాలా కామన్ గా జరుగుతుంది. ఈ ఇద్దరిని కలిసి పూజ చేస్తే శుభ ఫలం వస్తుంది. సాధారణ రోజుల్లో లక్ష్మి, విష్ణువును కలిసి ఒకేసారి పూజలు చేస్తారు. అయితే.. దీపావళి రోజన మాత్రం కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తారు. లక్ష్మీదేవితో పాటు గణేషుడు ఉంటాడు కానీ.. విష్ణు మూర్తి మాత్రం ఉండరు. దీనికి ఓ కారణం కూడా ఉంటుంది.
దీపావళి చాతుర్మాస్‌లో జరుపుకుంటారు. చాతుర్మాస సమయంలో విష్ణు మూర్తి నిద్రపోతూ ఉంటారు. నిద్రకోసం విష్ణుమూర్తి పాతాళ లోకానికి వెళ్తుంటారు. ఈ కారణంగా చాతుర్మాస్ సమయంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు. అందుకే దీపావళిలో జరిగే లక్ష్మీపూజలో విష్ణుమూర్తిని పూజించరు. విష్ణువు లేని సమయంలో లక్ష్మీ సమేతంగా ఆదిలో వినాయకుడిని ముందుగా పూజిస్తారు.
దీపావళి రోజు రాత్రి లక్ష్మి భూమిపైకి వస్తుంది: హిందూ మతం ప్రకారం, దీపావళి రాత్రికి తల్లి లక్ష్మి భూమిపైకి వస్తుంది. అందుకే రాత్రిపూట లక్ష్మీపూజ నిర్వహిస్తారు. లక్ష్మిని ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఇంటి ముందు వంకలు కట్టి, రంగోలి వేసి దీపం వెలిగిస్తారు. భక్తులను అనుగ్రహించేందుకు లక్ష్మీమాత భూలోకానికి వచ్చినట్లుగా..
విష్ణువు విశ్రాంతిలో ఉన్నాడు: విష్ణువు నాలుగు నెలలు నిద్రపోతాడు. ప్రపంచ బాధ్యతలన్నింటినీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సమయంలో ఆయన విశ్రాంతికి, నిద్రకు భంగం కలగకూడదని ఏ పనికి పిలవడం లేదని అంటారు. కానీ దీపావళి తర్వాత వచ్చే కార్తీక పూర్ణిమ రోజున విష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొంటాడని నమ్ముతారు. నిద్రానంతరం విష్ణువు పాతాళం నుండి వైకుంఠానికి వెళ్లి తల్లి లక్ష్మితో కూర్చుంటాడని నమ్ముతారు.
విష్ణువు వైకుంఠానికి తిరిగి వచ్చిన తర్వాత, మతపరమైన కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమవుతాయి. కార్తీక పూర్ణిమ నాడు వైకుంఠ తలుపులు తెరుచుకుంటాయి. పుణ్యకార్యాలు చేసిన వారు వైకుంఠాన్ని చేరుతారని, ఆ రోజున భక్తులు విష్ణు స్మరణలో మునిగిపోతారని ప్రతీతి. మహావిష్ణువు ఉదయించిన రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.