ధనత్రయోదశి నాడు ఇలా చేశారంటే.. మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు..
Dhanteras 2023: సనాతన ధర్మంలో.. ధనత్రయోదశి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను మనం కార్తీక మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ రోజు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుందని అంటారు. ఇందుకోసం ఏం చేయాలంటే?
Dhanteras 2023: ప్రతి ఏడాది కార్తీక మాసంలో ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ మాసం విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. అందుకే ఈ మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు తులసికి సంబంధించిన కొన్నిపరిహారాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందంటారు జ్యోతిష్యులు. అలాగే ఈ పరిహారాలు మీరు జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉండదంటారు. మరి ఇందుకోసం ధనత్రయోదశి నాడు తులసికి ఎలాంటి పరిహారాలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి ఆకుల రసం..
తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే ధనత్రయోదశి నాడు తులసి ఆకుల రసాన్ని తాగడం శుభప్రదంగా భావిస్తారు. ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. మీకు సంపదను తెలస్తుంది. అలాగే శ్రేయస్సును కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీ జీవితాన్ని ఆనందదాయకంగా కూడా చేస్తుందంటున్నారు జ్యోతిష్యులు.
దీపం
ధనత్రయోదశి నాడు మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద తులసి మొక్కను పెట్టండి. అలాగే మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ధనత్రయోదశి నాడు మాత్రమే ఇలా చేయాలి. ఆ తర్వాత రాత్రి కాకముందే తులసి మొక్కను తిరిగి ఇంట్లో పెట్టండి. దీనివల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు.
జమ్మి మొక్క
ధనత్రయోదశి నాడు తులసి మొక్కకు సంబంధించిన ఈ పనులు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజు ఇంటికి జమ్మి మొక్కను తీసుకురావడాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు జమ్మి మొక్కను ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట. అలాగే అమ్మవారి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్ముతారు.