Asianet News TeluguAsianet News Telugu

ధనత్రయోదశి 2023: ఈ రోజు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే?

Dhanteras 2023: ధనత్రయోదశి దీపావళి పండుగ మొదటి రోజు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు తమ ఇళ్లను పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు. అలాగే లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు మీరు మర్చిపోయి కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు.  
 

dhanteras 2023: do not do these things even by mistake on dhanteras rsl
Author
First Published Nov 10, 2023, 3:11 PM IST

Dhanteras 2023: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకునే పండుగల్లో ధనత్రయోదశి ఒకటి. ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును సంపద, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ రోజు లక్ష్మీదేవికి నిష్టగా పూజలు చేస్తారు. అలాగే రోజు కొన్ని వస్తువులను ఖచ్చితంగా కొంటుంటారు. ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఈ ధనత్రయోదశి పండుగ పండుగ లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడు, ధన్వంతరి ఆరాధనకు అంకితం చేయబడింది. కాగా ఈ పండుగ రోజు మీరు మర్చిపోయి కూడా కొన్ని పనులను చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. పూజా ఫలితం కూడా లభించదు. అంతేకాదు మీపై చెడు ప్రభావం కూడా పడుతుంది. ఇంతకీ ఈ రోజున ఏం చేయకూడదంటే? 

  • ఈ రోజు ముందుగా ఇంటితో పాటుగా ఆలయాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి. 
  • పనికిరాని వస్తువులన్నింటినీ ఇంట్లోంచి తీసేయాలి. 
  • చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున చీపురు కొనడం శుభప్రదం. 
  • ధనత్రయోదశి ఆవును పూజించి, వాటికి రొట్టె లేదా పచ్చిగడ్డి తినిపించడం మంచిదని జ్యోతిష్యలు చెబుతున్నారు.
  • ఈ పవిత్రమైన రోజున అవసరమైన వారికి సహాయం చేయండి. దీంతో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 
  • ఈ రోజు పూజా సమయంలో లక్ష్మీదేవి మంత్రాలను పఠించండి.
  • ఈ రోజు పదునైన వస్తువులను అంటే కత్తులు, చాకులు వంటి పదునైన వాటిని కొనకండి. 
  • అలాగే ధనత్రయోదశి నాడు గృహోపకరణాలు అమ్మకూడదు. 
  • ఈ రోజు బియ్యాన్ని దానం చేయకూడదు.
  • ఈ రోజు ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, మాంసాన్ని తినడం మానుకోండి. 
  • ధనత్రయోదశి నాడు ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. 
  • అలాగే ఈ రోజు ఆల్కహాల్ కు, జూదానికి దూరంగా ఉండండి.
  • ఈ రోజున మీ ఇంట్లో ప్రతి మూలలో వెలుతురు ఉండాలి. ఇంట్లో ఎక్కడా చీకటి లేకుండా చూసుకోండి. 
  • ధనత్రయోధశి నాడు నలుపు రంగు దుస్తులు, వస్తువులను కొనడం మంచిది కాదు. 
Follow Us:
Download App:
  • android
  • ios