బంగారాన్నే కాదు ధనత్రయోదశి నాడు వీటిని కొన్నా.. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది

dhanteras 2023: ధనత్రయోదశి నాడు ధన్వంతరి స్వామి దర్శనమిచ్చాడని శాస్త్రాలలో ఉంది. క్షీరసాగర మధనం సమయంలో విష్ణుమూర్తి ధన్వంతరీ అవతారం ఎత్తుతాడు. అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే మన జీవితంలో సిరి సంపదలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాల కోసం ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. కాగా ధనత్రయోదశి నాడు కొన్ని వస్తువులను కొనడం వల్ల మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అలాగని బంగారాన్నే కొనక్కర్లేదు. తక్కువ ధరలో లభించే వాటిని కూడా కొనొచ్చు.
 

dhanteras 2023: bring these things home on dhanteras you will get blessed by Goddess Lakshmi  rsl

dhanteras 2023: ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ ధన త్రయోదశిని  నవంబర్ 10 అంటే రేపే జరుపుకోనున్నాము. ఈ రోజు ధన్వంతరికి అంకితం చేయబడింది. ఈ ధన్వంతరీ విష్ణుమూర్తి అవతారమని చెప్తారు. కాగా ధనత్రయోదశి నాడే ధన్వంతరి స్వామి దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవిని కూడా నిష్టగా పూజిస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయనే నమ్మకం. అయితే ధనత్రయోదశి నాడు కొన్ని వస్తువులను కొంటే ఆదాయం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అయితే చాలా మంది ఈ పండుగకు బంగారం, వెండి వస్తువులనే కొంటుంటారు. వీటివల్ల ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని. అది నిజమే అయినా.. తక్కువ డబ్బులో వచ్చే కొన్ని రకాల వస్తువులను కొన్నా.. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉప్పు

అవును ధనత్రయోదశి నాడు మీరు ఉప్పును కూడా కొనొచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ధనత్రయోదశి నాడు ఉప్పును కొని మీ ఇంటికి తీసుకురండి. ధనత్రయోదశి నాడు ఉప్పును కొనడం వల్ల మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయి. 

చీపురు

వాస్తు శాస్త్రంలో ధనత్రయోదశి నాడు చీపురు కొనాలనే నియమం కూడా ఉంది. ఎందుకంటే వీటిని కూడా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ధనత్రయోదశి నాడు చీపుర్లు కొనండి.  ఈ రోజు చీపురును కొంటే పేదరికం తొలగిపోతుంది. అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

గోమతి చక్రం

ధనత్రయోదశి నాడు గోమతి చక్రాన్ని కొనడం కూడా శుభప్రదమే. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టైతే ధనత్రయోదశి నాడు గోమతి చక్రాన్ని కొని ఇంటికి తీసుకురండి. దీనిని పూజా గుడిలో పెట్టి పూజించండి. దీనివల్ల మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే శ్రేయస్సు, ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిని కూడా పూజించండి. ధనత్రయోదశి నాడు గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ధనియాలు

ధనత్రయోదశి నాడు ఎండు కొత్తిమీర లేదా ధనియాలను కొనడం గురించి జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావన ఉంది. అందుకే ధనత్రయోదశి నాడు తగిన మోతాదులో ఎండు కొత్తిమీరను కొనండి. దీనిని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోతుంది. అలాగే సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి.  అంతేకాకుండా ధనత్రయోదశి నాడు మీరు వంట పాత్రలను కూడా కొనొచ్చు. ఇలా చేసిన ధనత్రయోదశి నాడు ఫలితాలను పొందుతారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios