Ugadi 2022: ఉగాది పండుగ రోజున ఎలా పూజిస్తే ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది..

telugu new year 2022: ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. మరి ఈ పండుగ రోజు ఏ రాశుల జాతకం ఎలా ఉండబోతోందో పంచాంగం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ రోజున దేవుడిని నిష్టగా పూజిస్తే మీ కుటుంబం సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి.. 

devotional puja on ugadi day

Ugadi 2022: ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఆ రోజున ప్రజలంతా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. నువ్వుల నూనె, నలుగుపిండితో తలంటు పోసుకోవాలట. ఆ  తర్వాత కొత్త బట్టలు వేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజా గది ముందు చక్కగా ముగ్గులు వేసి దేవుడి గడిని అలంకరించుకోవాలి.

ఆ తర్వాత ఉగాది పచ్చడిని తయారుచేసుకోవాలి. చింతపండు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ, కొబ్బరి ముక్కలు, మిరపకాయలతో పచ్చడిని తయారుచేసి ఇష్ట దేవతలకు నైవేధ్యంగా సమర్పించాలి. ఈ ఏడాదంతా.. ఆనందంగా ఎలాంటి కష్టాలు ఎదురు కాకూడదని ఆ దేవుడిని మొక్కి ప్రసాదం స్వీకరించాలట. 

పూజా గదితో పాటుగా, ఇంటినంతా శుభ్రపరుచుకోవాలి. ముఖ్యంగా తెలుగు వారి సాంప్రదాయంగా గడపటను కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. 

అలాగే గుమ్మాలకు మామిడి, వేపకొమ్మలు, బంతిపూల మాలలను కట్టాలి. వీటివల్ల ఇంటి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు రావు. 

పూజలో వివిధ రకాల పూలను ఉపయోగించాలి. ఉగాది రోజున ఇష్టదేవతలకు ఉదయం ఏడు నుంచి పది గంటల మధ్య ఎప్పుడైనా  పూజించొచ్చని పండితులు చెబుతున్నారు. 

సాయంత్రం వేళ మర్చిపోకుండా దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినాలని పురాణాలుచెబుుతున్నాయి. 

ఉగాది పర్వదినం సందర్బంగా మునుపెన్నడూ మీరు వెళ్లన్ని పుణ్య క్షేత్రానికి వెళ్లి దేవుడుని దర్శించుకుంటే.. శుభ ఫలితాలు కలుగుతాయట. 

అంతేకాదు వసంత నవరాత్రి పేరిట వివిధ ఆలయాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాళ్లో పాల్గొంచే కూడా ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios