శరన్నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారం అమ్మవారిని కొలుసుకుంటారు. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా రవ్వకేసరి నివేదన చేస్తారు.   

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

        
                లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
                దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
                శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
                త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

శరన్నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారం అమ్మవారిని కొలుసుకుంటారు. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా రవ్వకేసరి నివేదన చేస్తారు. 

రవ్వకేసరికి కావలసినవి పదార్ధాలు :-

రవ్వ 1 కప్పు 

షుఘర్ 3/4 కప్పు 

నెయ్యి 2 టెబల్ స్పూన్

కేసరి కలర్ / చిటికెడు.

యాలకులు -  4

ఎండుద్రాక్షా - 6

జీడిపప్పు - 10

మిల్క్ 1 కప్పు

మిల్క్ మేడ్ 1 

వాటర్ 1/2 కప్పు 

రవ్వకేసరి చేసే విధానం :-

ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసిఉంచండి. మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు ఎండుద్రాక్ష వేయించి తీసిఉంచండి. నీళ్ళు, పాలు, కలిపి బాగా మరగనివ్వాలి. అందులో కేసరి కలర్, చెక్కర, రవ్వ , వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో ద్రాక్షా ,జీడిపప్పు , మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడిగా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించి నైవేద్యం సమర్పించండి.