- ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

స్వస్తిశ్రీ శ్రీ శార్వరి నామ సంవత్సర పుష్య మాసం శుద్ధ పాఢ్యమి గురువారం రోజున సూర్య భగవానుడు ఉత్తారాషాఢ నక్షత్రం రెండవ పాదం, మకరరాశిలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ప్రవేశం చేయుటవలన ఉత్తరాయాణ పుణ్య ఘడియలు కావడం చేత ప్రజలు ఇంగ్లీష్ తేది ప్రకారం 14 జనవరి గురువారం రోజు మకర సంక్రాంతి పండగ జరుపుకుంటారు. 13 బుధవారం భోగి పండగ, 15 శుక్రవారం కనుమ ( పశువుల పండగ ) జరుపుకుంటారు. 

గురుమౌఢ్యమి :- స్వస్తిశ్రీ  శార్వరి నామ సంవత్సర పుష్య మాసం శుక్ల విదియ 14/15 జనవరి 2021 రాత్రి 4 గంటల 59  నిమిషాలకు తెల్లవారితే శుక్రవారం అనగా పశ్చిమ దిక్కున మకరరాశి శ్రవణా నక్షత్ర ప్రధమ పాదంలో గురు గ్రహం అస్తమించుటచే గురుమౌఢ్యమి ప్రారంభమగును. తిరిగి మాఘమాస శుక్లపక్ష పాఢ్యమి 12 ఫిబ్రవరి 2021 శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు తూర్పు దిక్కున శ్రవణా నక్షత్ర మూడవ పాదంలో  గురుగ్రహం ఉదయించడంతో  గురు మౌఢ్యమి త్యాగామవును. 

శుక్ర మౌఢ్యమి:- స్వస్తిశ్రీ  శార్వరి నామ సంవత్సర మాఘమాసం శుక్ల విదియ 13/14 ఫిబ్రవరి 2021 రాత్రి 12: 21 నిమిషాలకు తెల్లవారితే ఆదివారమనగా తూర్పు దిశన మకరరాశిలో శ్రవణనక్షత్ర నాల్గవ పాదంలో శుక్ర గ్రహం అస్తమించుటచే శుక్ర మౌఢ్యమి ప్రారంభమగును. తిరిగి ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి 4 మే 2021 మంగళవారం ఉదయం 7 గంటలకు పశ్చిమ దిశలో మేషరాశి కృత్తికా నక్షత్ర ప్రధమ పాదంలో శుక్రగ్రహం ఉదయించుటచే శుక్ర మౌఢ్యమి త్యాగామగును.  ( మౌఢ్యమి వివరణ సూర్య సిద్దాంత పంచాంగ కర్త దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారి పంచాగం ఆధారంగా ఇవ్వబడినది ) 

గురు, శుక్ర మౌఢ్యాలలో వివాహాది సుముహుర్తాలు, శుభకార్యాలు చేయరాదు. సుమారు 104 రోజులు శుభకార్యములకు ముహూర్తములు లేవు.    


* శుక్ర, గురు మూఢాలైనా ఈ క్రింది కార్యములు నిస్సందేహంగా చేసుకోవచ్చును.  

1. నవగ్రహశాంతులు

2. రుద్రాభిషేకం

3. అన్ని రకాల హోమాలు

4. నవగ్రహ జపాలు, 

5. ఉత్పాతాది దోషములకు శాంతులు

6. దేవాలయంలో సంభవించే అగ్నిప్రమాదాలకు, కొన్నినెలలుగా నిత్య నైవేద్యాలు పెట్టకపోయినా తగిన ప్రాయచిత్తశాంతులు, సంప్రోక్షణలు చేయవచ్చు.

7. సీమంతము, జాతకర్మ, నామకరణ, అన్న ప్రాసనాది, ఊయలో బిడ్డను వేయుటకు. 

8. ఇంటి పైకప్పులు, ఇంటిపై స్లాబులు వేసుకోవచ్చు.

9. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలుగాని,  గృహాలకు మరమ్మత్తులు చేసుకోవచ్చును.

10. చండీహోమలు, నవవిధ శాంతులు చేసుకోవచ్చు.

11. పెళ్లిచూపులు చూడవచ్చును.

12. వ్యాపారం ప్రారంభం చేయవచ్చును.

13. స్థలాలు కొనవచ్చు, రిజిస్టేషన్ చేసుకోవచ్చును.

14. సీమంతము.

15. జాతకర్మ, నామకరణం.

16. అన్నప్రాశనాది, కార్యక్రమాలు. చేసుకోవచ్చును.

.......................

* శుక్ర, గురు మూఢాలలో అస్సలు చేయకూడని కార్యక్రమములు :- 

1. గృహప్రవేశములు, 

2. వివాహములు,

3. ఉపనయణములు, 

4. దేవాలయ ప్రతిష్ఠలు, 

5. దేవాలయ శంకుస్థాపన, 

6. గృహశంఖుస్థాపన, 

7. బోరు వేయుట, బావులు త్రవ్వుట, 

8. నూతన వాహణములు కొనుటచేయరాదు.