ఇంటి కి శుభాన్ని తెచ్చే మొక్కలు ఇవే..

దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు (ప్లమ్ ట్రీ ), తుమ్మ ( అకాసియా ) చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. 

Benefits of Adding Plants and Greenery to Your Space

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Benefits of Adding Plants and Greenery to Your Space

కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉద్యోగంలో ఒత్తిడి, సంతోషం లేని సంసారం గడుపుతూ ఇంట్లో సమస్యలు ఒక్కసారిగా వచ్చినట్లు భావిస్తున్నారా? కొన్ని ఉద్యోగ జీవితంలో కొన్ని కుటుంబంలో కొన్ని సమస్యలు వేదిస్తున్నాయా? మానసిక ఆరోగ్యంపై ప్రభావ పడుతుందా? ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటే తప్పకుండా మీ ఇంటి వాస్తును సరిచూసుకోవాల్సిందే. ఇంకా అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ ఇంటి చుట్టు పక్కల ఎలాంటి చెట్లు, మొక్కలు ఉన్నాయో పరిశీలించాలి. ఎందుకంటే చెట్ల వల్ల మీ కుటుంబంపై కొన్ని మంచి ప్రభావాలు ఉండగా మరికొన్ని చెడు ప్రభావాలు పడనున్నాయి. 

అంటే కొన్ని చెట్ల వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ప్రతికూల ప్రభావం ఉత్పన్నమై సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాటిని ఇంటికి దూరంగా ఉండేట్లు చూసుకోవాలి. ఇంటి చుట్టు పక్కల ఎత్తయిన చెట్లు ఉండకూడదు. ఇంటికి దగ్గరలో కొన్ని ప్రతికూల ప్రభావాన్ని కలిగించే చెట్లను ఉంచకూడదు. ఒకవేళ అవి పెద్దలు నాటిన చెట్లయితే శుభాన్ని కలిగించే నిమ్మ, కొబ్బరి, తులసి చెట్లను వాటికి దగ్గరలో నాటితే మంచిది. 

దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు (ప్లమ్ ట్రీ ), తుమ్మ ( అకాసియా ) చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతిని సృష్టిస్తాయి. ఇంట్లో లేదా పని ప్రదేశాల్లోనూ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఉన్నతాధికారుల కోపానికి గురవడమే కాకుండా వారు మీపై నిర్లక్ష్యంగా ఉంటారు. అంతే కాకుండా ఇంటికి తూర్పు దిశలో ఎత్తైన చెట్లు ఉండకూడదు. 

ఆశుభాలను కలిగించే చెట్లు :- ఇంటి చుట్టు పక్కల సగం కాలిన వస్తువులు, సగం ఎండిన వస్తువులు, పొడవాటి వృక్షాలు ఉండకూడదు. అంతే కాకుండా మూడు లేదా అంతకంటే శిరాగ్రాలున్న చెట్లు కూడా ఉండ కూడదు. ఇవి ఉంటే అశుభంగా పరిగణిస్తారు. అంతే కాకుండా వీటి వల్ల ఇంట్లో సుఖ - సంతోషాలకు అవరోధాలుగా ఉంటాయి. కుటుంబంలో పిలల్ల సంతోషం వారి విజయంపై కూడా ప్రభావం చూపుతుంది. మానసిక అనారోగ్యం కూడా కలుగుతుంది. 

​దుష్టశక్తులను ప్రేరేపించే చెట్లు :-  చింత, రోజ్మేరీ లాంటి చెట్లను ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ నాటకూడదు. ఎందుకంటే వీటిపై దుష్టశక్తులు నివసిస్తాయని నమ్ముతారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులెవరూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారు. ఇది కాకుండా వివాహ జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. పిల్లలతో ఎప్పుడూ వివాదాలు, గొడవలను కలిగి ఉంటారు. ఇంటి పెద్దలను కూడా గౌరవించరు. కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు వస్తాయి. అంతే కాకుండా రోజు వారి పరిస్థితులు దిగజారి దరిద్రం ఎక్కువుతుంది.

​శుభాలను కలిగించే చెట్లు :-  మొక్కలు అనేవి ఇంట్లో పెద్దవాళ్లు నాటి ఉంటారు. ఇది తెలియని వాళ్లు గుర్తుంచుకోకుండా వాటిని కత్తిరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్ర ప్రకారం ఇతర మార్గాలను అమలుపరచాలి. నాగకేశర, అశోక, నిమ్మ, కొబ్బరి, గంధం, తులసి లాంటి మొక్కలను అశుభం కలిగించే చెట్లకు దగ్గరలో నాటితే మంచిది. ఫలితంగా పాజిటివ్ ఎనర్జీ ఆ చెట్ల ద్వారా ఉత్పన్నమవుతుంది. నెగటివ్ ఎనర్జీని పారద్రోలి శుభాన్ని కలగజేస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios