మంగళవారం రోజు ఈ పనులు చేయకూడదు

శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమౌతుందని మంగళవారం అప్పు పొరబాటున కూడా చేయవద్దు అంటారు.

As per astrology do not do these things on Tuesday

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

As per astrology do not do these things on Tuesday

మంగళవారం (Tuesday), అనేది వారంలో మూడవ రోజు. ఇది సోమవారంనకు, బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంరోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజ (అంగారక) గ్రహానికి సంబంధించినది. 

ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

అప్పు తీసుకోకండి:- శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమౌతుందని మంగళవారం అప్పు పొరబాటున కూడా చేయవద్దు అంటారు.

కొత్త బట్టలు కొనకూడదు:- మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందు సంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.

అనారోగ్యంపై ప్రభావం:- మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సుల చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో చికాకులకు మొదలవుతాయి.

హెయిర్ కట్, షేవింగ్  చేస్తే ఆయుక్షీణం:- మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్ గోర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుస్సు తగ్గిపోతుందని చెబుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశముంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. 

కొత్త బూట్లను ధరించకూడదు:- శనితో సంబంధమున్నందను మంగళవారం కొత్త దుస్తులుతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదముందని భావిస్తారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పూర్వం పెద్దలు ఇలాంటి పద్దతులను ఎదో బలమైన కారణం లేకుండా ఊరకే పెట్టరు కాబట్టి మనం ఆచరించాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios