Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్య సంబంధం ఉసిరి

ఆధ్యాత్మిక పరంగా ఉసిరి కాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం. గంగానదిలో మునిగిన పుణ్యఫలితాన్ని ఇస్తుందట. ఉసిరి ఆయుర్దాయాన్నిపెంచుతుంది, చర్మ సౌందర్యానికి, జుట్టు మెత్తగా పట్టులా మారుతుంది. ఆదివారం, శుక్రవారం, అమావాస్య, షష్ఠి, సప్తమి, నవమి తిథుల్లో ఉసిరి కాయను ఉపయోగించకూడదు.
Amla - 8 reasons to eat everyday
Author
Hyderabad, First Published Apr 15, 2020, 9:01 AM IST
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Amla - 8 reasons to eat everyday
ఉసిరి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. ఉసిరిని ఆమ్లా అని కుడా పిలుస్తారు. ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గురువు తెలియజేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు వున్న చోట శ్రీమహాలక్ష్మీ దేవి నివాసం వుంటుందని కుడా శాస్త్ర వచనం. ప్రతీ మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగి వేసి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉసిరికాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఆధ్యాత్మిక పరంగా ఉసిరి కాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం. గంగానదిలో మునిగిన పుణ్యఫలితాన్ని ఇస్తుందట. ఉసిరి ఆయుర్దాయాన్నిపెంచుతుంది, చర్మ సౌందర్యానికి, జుట్టు మెత్తగా పట్టులా మారుతుంది. ఆదివారం, శుక్రవారం, అమావాస్య, షష్ఠి, సప్తమి, నవమి తిథుల్లో ఉసిరి కాయను ఉపయోగించకూడదు.

ఉసిరికాయ చెట్టు ఇంట్లో వుండటం ద్వారా మనచుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పరిచేలా చేస్తుంది. ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగినా.. ఉసరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదు. అంతేగాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు అరచేతిలో నివసిస్తుంది. అలాంటి పుణ్య ప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం, దానిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

ఇంకా కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే నవమి రోజు ఉసిరి చెట్టును పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆ రోజున ఆ చెట్టు కింద పది నిమిషాలు కూర్చుని శివుడిని ధ్యానం చేసినా సర్వాభీష్టాలు చేకూరుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టు వున్నట్లైతే ఈతి బాధలు వుండవు. ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది.

ఇంట్లో చెట్టును నాటలేక పోతే.. ఆలయాలలో వుండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి పెరుగుతుంది. ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ, మధ్యలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు వుంటారని విశ్వాసం. భార్యా భర్తలు తరచూ గొడవ పడుతుంటే ఉసిరి చెట్టుకు ఏడుసార్లు నూలు పోగులు చెట్టు చుట్టూ తిరుగుతూ కట్టాలి. ఆ తర్వాత నేతితో దీపం వెలిగించి, కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుంది.

ఉసిరిలో ఎన్నో ఔషధ గుణములు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో ఉసిరికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఉసిరి పొడిని త్రిఫలా చూర్ణంలో కలుపుతారు. ఉసిరికాయ షాంపో జుట్టును కాంతివంతంగా చేయడమే కాదు సిల్కిగా ఉంచుతుంది. తరచూ ఉసిరి తినే వారికి విటమిన్స్ పుష్టిగా లభించి శరీరం కాంతి వంతంగా తయారై అందాన్ని పెంచుతుంది. కంటికి చలువ, ఆరోగ్యదాయిని. కొంత మంది ఉసిరికాయ నిలువ పచ్చడి చేసుకుని రోజు తింటారు. ఇంకొందరు సీజన్ లో దొరికే ఉసిరి కాయల్ని తేనెలో నానబెట్టి అవి మాగిన తర్వాత రోజు ఉదయం పరిగడుపున తింటారు.  

ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి మూడు లేక నాలుగు సార్లు త్రాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. బరువు నియంత్రణకు ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

ఔషధగుణములు :- ఉసిరి కాయలలో విటమిన్ 'సి ' అధికముగా ఉంది. దీన్ని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల, మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విధంగా కురుల ఆరోగ్యానికి కూడ ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు, కాలేయం, జీర్ణమండలం, గుండె - దీని పరిదిలోనికి వస్తాయి .

జీర్ణమండలం :-  దాహం,మంట,వాంతులు,ఆకలిలేకపోవుట,చిక్కిపోవుట,ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, మున్నగు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .

ఉపిరితిత్తులు :- ఆస్తమా, క్షయ, శ్వాసనాలముల వాపు, ఉపిరితిత్తుల నుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .

గుండె :- ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది. శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .

కాలేయము :- కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయంలో చేరిన మలినాలు, విష పదార్ధాలును తొలగిస్తుంది, 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .

కామెర్లు :- ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే వైటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి, కామెర్లు రాకుండ సహాయపడుతుంది.

మలబద్ధకం:- మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది

నోటి పూత:-నోటి పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.

కంటిచూపు:- ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం, దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.
 
 
Follow Us:
Download App:
  • android
  • ios