ఆదివారం అమావాస్య.. ఇలాచేస్తే రాజయోగం పడుతుంది..!
సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉండేంత వరకూ ఆదివారం అద్భుతమైన రోజుగా చెబుతున్నారు. దాన్నే రవి పుష్యయోగం అని పిలుస్తున్నారు.
ఆదివారం అమావాస్య రావడమే చాలా అరుదుగా ఉంటుంది. అందులోనూ రేపు అనగా ఆగస్టు8వ తేదీన వచ్చే అమావాస్య మరింత అరుదైనదట. ఇలాంటి రోజు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
ముఖ్యంగా ఈ ఆదివారం సూర్య భగవానుడు... పుష్యమి నక్షత్రంలో ఉదయం 9గంటల 30 నిమిషాల వరకు ఉంటారు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్లిపోతారు. సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉండేంత వరకూ ఆదివారం అద్భుతమైన రోజుగా చెబుతున్నారు. దాన్నే రవి పుష్యయోగం అని పిలుస్తున్నారు. దానికితోడు ఆదివారం నాడు అమావాస్య కూడా. ఇలా సూర్య భగవానుడు... ఆదివారం వేళ పుష్యమీ నక్షత్రంలో ఉండటం అనేది అరుదైన, అద్భుతమైన రోజు అని పండితులు చెబుతున్నారు.
ఈ రోజు ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే.. ఆర్థిక వృద్ధిని కలిగిస్తుందట. వాస్తు దోషాలను కూడా పొగొడుతుంది. అన్ని రకాలుగా మంచి ఫలితాలు కలుగుతాయట. రాజయోగం కూడా పడుతుందట. కష్టాలు, దరిద్రం ఏమైనా ఉంటే తొలగిపోతాయి. జీవితంలో బాగా ఎదగడానికి చాలా సహాయం చేస్తుంది.
మరి దీనికోసం మనం ఏచేయాలంటే..రేపు ఉదయం 9గంటల 30 నిమిషాల వరకు సూర్య భగవానుడు పుణ్యమీ నక్షత్రంలో ఉంటాడు. తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ లోపు తెల్ల జిల్లేడు చెట్టుకు వెళ్లి పూజ చేయాలి. ఆ చెట్టుకు ఓ కంకణం కట్టి... ఆ చెట్టుకి పసుపు, కుంకుమలు చల్లి... బెల్లం కలిపిన నీళ్లను ఆ చెట్టుకు పోసి.. "ఓ వృక్ష రాజమా... నీ నుంచి ఓ వస్తువు తీసుకెళ్తున్నాను. ఇది నాకు అన్ని విధాలా మేలు చెయ్యాలి. ఐశ్వర్యం ప్రసాదించాలి" అని కోరుకోవాలి. ఆ తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరు చిన్న ముక్క లేదా... బెరడు చిన్న ముక్క తీసుకోవాలి. దాన్ని ఇంటికి తీసుకెళ్లాలి.
ఇంటికి తీసుకెళ్లిన వేరును ఒకేసారి మొత్తం వాడేయకూడదు. అది అత్యంత పవిత్రమైనది. దాన్లో కొంత భాగాన్ని ఒక తాయత్తులో... వెండి లేదా ఇత్తడి లేదా పంచలోహాల తాయత్తు లేదా రాగి తాయత్తులో తెల్ల జిల్లేడు వేరును కొద్దిగా వేసి... సూర్య భగవానుడి నామస్మరణ చేస్తూ... సూర్య నమస్కారం చేసుకొని... మెడలో ధరించాలి. సూర్యుణ్ని నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే... దారిద్ర్యం వదిలిపోతుంది. అప్పుల నుంచి బయటపడతారని పండితులు సూచిస్తున్నారు. తెల్ల జిల్లేడు వేరు తాయత్తు ధరించేవారికి ఆరోగ్యం, ఆయుష్యు, ఐశ్వర్యం మూడూ లభిస్తాయనీ... ఆ ఇంట పెళ్లిళ్లు జరుగుతాయనీ, ఉద్యోగాలు లభిస్తాయనీ, విదేశీయానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.