Asianet News TeluguAsianet News Telugu

Akshya Tritiya 2022 : అక్షయ తృతీయ నాడు జలదానం.. ఎన్నో తీర్థయాత్రలు చేసినంత ఫలం...

అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలూ సిద్ధించే రోజు అన్నట్టు... అందుకే ఈ రోజు ఈ దానం చేస్తే అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు లక్ష్మీ దేవి దేవతలను పూజించడం ఈ దానం చేస్తే మంచిదని చెబుతారు.

Akshya Tritiya 2022 : donating water on Akshya Tritiya
Author
Hyderabad, First Published Apr 28, 2022, 12:47 PM IST

ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయనాడు అక్షయతృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 3న వస్తోంది.  అక్షయ తృతీయనాడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతలను పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున వివాహాది శుభకార్యాలకు అనువైన రోజు. ఈరోజు ఏ సమయంలోనైనా ఏ పనైనా మొదలు పెట్టవచ్చును అని చెబుతారు. ప్రత్యేకించి ముహూర్త ఘడియలు చూసుకోవాల్సిన పనిలేదు.

అక్షయ తృతీయ.. మూడు ప్రత్యేక శుభ యాదృఛ్ఛికాలు…
ఈసారి అక్షయ తృతీయ అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది అక్షయ తృతీయనాడు మూడు ప్రత్యేక యోగాలు జరుపుకుంటారు. ముందుగా ఈ సారి అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం, శోభన యోగం మధ్య జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైనది. ఇదే రోజు కుజుడు,రోహిణి యోగం కూడా ఏర్పడుతోంది.

అలాగే, ఈ రోజున శని కుంభరాశిలో, గురుడు మీనరాశిలో  సంచరిస్తాడు. దీని కారణంగా అక్షయతృతీయనాడు శుభయోగం కలుగుతుంది. మే 3,  2022 మంగళవారం ఉదయం 5 గంటల ముప్పై తొమ్మిది నుండి మధ్యాహ్నం12 గంటల 18 నిమిషాల వరకు అక్షయ తృతీయ నాడు ఆరాధనకు అనుకూలమైన సమయం. ఉదయం 05:39  నుండి  మరుసటి రోజు ఉదయం 05:38 వరకు బంగారం,వెండి, మట్టికుండ మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం.

జలదానంతో అన్ని తీర్థయాత్రలు చేసినంత ఫలం
అక్షయ తృతీయ నాడు దానం చేస్తే అత్యంత శుభప్రదంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రోజున జలదానం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున నీటితో నిండిన కుండలను దానం చేస్తే అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చాలామంది అక్షయతృతీయ నాడు జలదానం చేస్తారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున మొక్కలు నాటడం, జంతువులు, పక్షులకు దానాతో పాటు వాటి దాహాన్ని తీరిస్తూ చాలా మంచిదని విశ్వసిస్తారు.

ఇక అక్షయ తృతీయ అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించే తిథి అని అర్థం. తరగని అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథిగా అక్షయ తృతీయ గురించి చెబుతారు. వైశాఖ మాసంలో రోహిణి నక్షత్రంలో తదియ తిథినాడు అక్షయ తృతీయ వస్తుంది. ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా అక్షయ తృతీయనాడు ప్రత్యేకించిన ముహూర్తం అవసరం లేదని చెబుతారు. ఈసారి అక్షయతృతీయ మే3న వస్తోంది. 

అక్షయ తృతీయ శుభ ముహూర్తం... 
అక్షయ తృతీయ తిథి మే3 మంగళవారం 2022, ఉదయం 05:19 గంటలకు ప్రారంభమవుతుంది. మే 4, ఉదయం 07.33 గంటల వరకు కొనసాగుతుంది. మే 4వ తేదీ ఉదయం 12:34 గంటల నుంచి 03:18 గంటల వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios