Asianet News TeluguAsianet News Telugu

'కల్కి' తో పోలిక వస్తుందనే ...సూర్య 350 కోట్ల బడ్జెట్ సినిమా ఆపేసారు?


ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఫైనల్ అయ్యిపోయారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేయనుందని వార్తలు వచ్చాయి. 

Why Suriya Rs 350 Cr Film Shelved? jsp
Author
First Published Jun 27, 2024, 8:08 PM IST


యంగ్ రెబల్ స్టార్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్ మూవీ కల్కి2898 ఏడీ గురించే ఇప్పుడు ఎక్కడ విన్నా.  పురాణ గాధకు సైన్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్ అని అందరూ మెచ్చుకుంటన్నారు. అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో మూవీ లవర్స్‌కు కనువిందు చేశాడు నాగీ. అమితాబ్, దీపికా, దిశా పటానీ, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజ స్టార్స్ మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరియా, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఆర్జీవీ వంటి వారు క్యామియో రోల్స్ చేశారు. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాకు తొలి షో నుండే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు సైతం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని, కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో సూర్య తో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన సినిమా ఆపేసారని తెలిసింది. అందుకు కారణం కల్కి అనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో సూర్య గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. సూర్య ఈ సినిమాతో హిందీలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.  ఆ ప్రాజెక్టు పేరు  'కర్ణ' . రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఈ ఇతిహాస కథను రెండు భాగాల ఎపిక్‌ గా నిర్మిస్తున్నట్టు ప్లాన్ చేసారు. ఇది మహాభారత కాలంలో జరిగిన సన్నివేశాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాకేష్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఈ మూవీపై సూర్య కూడా అత్యంత ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. తన కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకటైన ఈ 'కర్ణ' పాత్రను పోషించేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుసింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఫైనల్ అయ్యిపోయారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని వద్దనుకుని ఆపేసారు. ఇప్పటికే 15 కోట్లు దాకా ఖర్చు పెట్టారు. కానీ కల్కి లో ప్రభాస్ ...కర్ణుడుగా కనపడుతున్నాడని తెలియటం, సూర్య సైతం మొదట ఉన్న ఉత్సాహం చూపకపోవటంతో సినిమాని ఆపేసారంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా బడ్జెట్ రికవరీలు దగ్గర సమస్య రాబోతోందని, ఆ మేరకు బిజినెస్ అవుతుందా అనే సందేహమే వారిని వెనక్కి లాగిందంటున్నారు. కల్కి లాంటి విజువల్స్ ని చూసిన తర్వాత అంతకు మించి లేకపోతే తేలిపోతుందని హీరో సూర్య భావించారని చెప్పుకుంటున్నారు. 
 
'కర్ణ' అనేది రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా డ్రీమ్ ప్రాజెక్ట్. అతను కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాడు. ఈ చిత్రం ఖచ్చితంగా భారతదేశంలోనే ఓ గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని బాలీవుడ్  నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సూర్య కెరీర్ లో ఇంత క్లిష్టమైన పాత్రను ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు.  కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త అభిమానులను బాధపెడుతోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios