Asianet News TeluguAsianet News Telugu

కల్కి చిత్రానికి సూపర్ హిట్ టాక్, విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఇలా..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కల్కి ధాటికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. 

Vijay Devarakonda interesting comments on Prabhas Kalki success dtr
Author
First Published Jun 27, 2024, 10:18 PM IST

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కల్కి ధాటికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. సెలెబ్రిటీలంతా కల్కి చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. 

ఈ చిత్రంలో ఒకరా ఇద్దరా.. బోలెడంత మంది స్టార్లు నటించారు. అమితాబ్ మొదలుకుని విజయ్ దేవరకొండ వరకు.. రాజమౌళి మొదలుకుని డైరెక్టర్ అనుదీప్ వరకు కామియో రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మహాభారతంలో అర్జునుడిగా నటించిన సంగతి తెలిసిందే. 

అర్జున్ రెడ్డిని నాగ్ అశ్విన్ అర్జునుడిగా మార్చేశారు అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కల్కి మూవీ బిగినింగ్ లో మహా భారతంలోని సన్నివేశాలు వస్తాయి. ఆ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించారు. 

 

కల్కి చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ తొలిసారి స్పందించారు. సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్, ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేశారు. నాగి, ప్రభాస్ అన్నా, వైజయంతి సంస్థ.. మీ పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఈ విజయానికి అర్హులు అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios