`కల్కి 2898 ఏడీ`కి మరో షాక్‌.. కనీసం టాప్‌ 10లోనూ లేని ట్రైలర్‌

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి 2898 ఏడీ` సినిమా కోసం ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. కానీ మూవీకి బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా హైప్‌ తేలేకపోయింది.
 

kalki 2898 ad telugu trailer biggest disaster arj
Author
First Published Jun 12, 2024, 6:27 PM IST

తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `కల్కి 2898ఏడీ` సినిమా మరో రెండు వారాల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ప్రభాస్‌తోపాటు భారీ కాస్టింగ్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీని కోసం ఆడియెన్స్ ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు విజయ్‌ దేవరకొండ, నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌, రాజమౌళి, వర్మ, అనుదీప్‌ వంటి చాలా మంది స్టార్స్ గెస్ట్ లుగా మెరవబోతున్నారు. విజయ్‌ దేవరకొండ పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం `కల్కి 2898 ఏడీ` ట్రైలర్‌ విడుదలైంది. సినిమా రిలీజ్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో హైప్‌ తెచ్చేందుకు టీమ్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో పాత్రలని పరిచయం చేసినట్టుగానే ఉంది. అదే సమయంలో రెండు ప్రపంచాల్లో సినిమా సాగుతుందని తెలిపారు. ఓ పవర్‌ కోసం, ఓ బిడ్డ కోసం సాగే పోరాటంగా సినిమా సాగుతుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది. ఇందులో ప్రభాస్‌ భైరవ పాత్రలో కాస్త కామెడీగా, ఇంకాస్త సీరియస్‌గా కనిపించాడు. ప్రభాస్‌ మార్క్ యాక్షన్‌ సీన్లు ఒకటి రెండు ఉన్నాయి. వాహ్‌ అనిపించే షాట్స్ అయితే లేవు. 

అయితే ట్రైలర్‌తో అయినా `కల్కి` సినిమాపై బజ్‌ క్రియేట్‌ అవుతుందని టీమ్‌ భావించింది. హైప్‌ వస్తుందని ఎంతో ఆశగా ప్లాన్‌ చేశారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్‌ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌, బుజ్జి వీడియోలు కూడా హైప్‌ని జనరేట్‌ చేయలేకపోయాయి. ఇది రెగ్యూలర్‌ సినిమా కాకపోవడం, మాస్‌ ఆడియెన్స్ కి నచ్చే ఎలిమెంట్లు లేకపోవడంతో `కల్కి`కి హైప్‌ రావడం లేదు. అయితే ఈ ట్రైలర్‌ లో అవి మేళవించారు. విజువల్‌ వండర్‌ ని చూపిస్తూనే యాక్షన్‌ కూడా చూపించారు. ప్రభాస్‌ పాత్రలోని హీరోయిజాన్ని చూపించారు. అయినా ఆశించిన స్థాయిలో బజ్‌ జనరేట్‌ కావడం లేదు. కేవలం మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. కానీ బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ కి రీచ్‌ కాలేకపోయింది. 

అంతేకాదు ఈ ట్రైలర్‌ కూడా సత్తా చాటలేకపోయింది. దీనికి వ్యూస్‌ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ట్రైలర్స్ లో టాప్ 10లోనూ `కల్కి 2898ఏడీ` ట్రైలర్‌ లేకపోవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో ఈ ట్రైలర్‌కి కేవలం 14.43 మిలియన్స్ వ్యూస్‌ని మాత్రమే వచ్చాయి. ప్రస్తుతానికి టాప్‌లో మహేష్‌ బాబు `గుంటూరు కారం` ఉంది. దీనికి 24 గంటల్లో 37.65 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. 

ఆ తర్వాత `సలార్‌` ట్రైలర్‌కి 32.58 మిలియన్‌ వ్యూస్‌, `సర్కారు వారి పాట`కి 26.7మిలియన్‌ వ్యూస్‌, `రాధేశ్యామ్‌`కి 23.2 మిలియన్‌ వ్యూస్‌, `ఆచార్య`కి 21.86మిలియన్‌ వ్యూస్‌, `బాహుబలి 2`కి 21.81 మిలియన్స్, `ఆర్‌ఆర్‌ఆర్‌`కి 20.45 మిలియన్స్, `కేజీఎఫ్‌ 2`కి 19.38 మిలియన్స్, `బ్రో`కి19.25 మిలియన్స్, `వకీల్‌ సాబ్‌`కి 18 మిలియన్స్ వ్యూస్‌తో టాప్‌ 10లో ఉన్నాయి. మరి గ్లోబల్‌ ఫిల్మ్ రేంజ్‌లో రూపొందిన `కల్కి` కనీసం టాప్ 10లోనూ స్థానం సంపాదించుకోకపోవడం విచారకం. రెండు రోజుల్లోనూ ఇది 18 మిలియ్స్ దాటలేకపోవడం గమనార్హం. అయితే రిలీజ్‌కి ముందు మరో ట్రైలర్‌ని విడుదల చేయబోతుందట టీమ్‌. అది అయినా బజ్‌ క్రియేట్‌ చేస్తుందా అనేది చూడాలి. దీనికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios