*కెసిఆర్ మీద కుట్ర నిజాలు చెప్పాలంటున్న బిజెపి * కుట్ర జరిగిందా, అయితే ఎలా , ఎక్కడ, ఎపుడు? బిజెపి ప్రశ్న* టిఆర్ ఎస్ , ఎంఐఎం స్నేహబంధం ఎందుకంతమధురమో
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని భాగా ఇరుకున పెట్టే ప్రశ్న బిజెపి సభాపక్ష నాయకుడు కిషన్ రెడ్డి సంధించారు. ఆమధ్య, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఒక కుట్ర జరిగిందని, దాని నుంచి తమని కాపాడిండి ఎంఐఎం పార్టీ అని ముఖ్యమంత్రి ఒక రాజకీయ ప్రకంపన సృష్టించారు. ఈ కుట్ర ఏమిటో ఎవరు చేశారో, ఎందుకు చేశారు, ఆ కుట్ర నుంచి ఎంఐఎంని కెసిఆర్ ని ఎలా కాపాడిందో ప్రజలందరికి అర్థమయ్యేలా చెప్పాలని ఇపుడు కిషన్ రెడ్డి టిఆర్ఎస్ నేతను గిల్లుతున్నారు.
రెండుమూడు నెలల కిందట, కాంగ్రెస్ నల్గొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాల గూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ భాస్కర్ రావు,సిపిఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ రమావత్ టిఆర్ఎస్ లోకి చేరేటపుడు ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కెసిఆర్ ఈ కుట్ర జరిగిన విషయాన్నిబయటపెట్టారు. 2014 ఎన్నికలు గెలిచినా తాను ముఖ్యమంత్రి కాకుండా కొంత మంది నాయకులు కుట్ర పన్నారని ఆయన అన్నారు.
’ మీకొక రహస్యం చెబుతున్నారు. ఇంతవరకు దీనిని బయటపెట్టే అవకాశం రాలేదు. నేనింకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే చంద్రబాబు బీకరంగా ఒక మాటఅన్నారు. బెర్లిన్ గోడ కూలిపోయాక జర్మనీలు రెండు కలసిపోయినట్లు తొందర్లోనే ఆంధ్ర తెలంగాణా మళ్లీ కలసిపోతాయని ఆయన అన్నాడు. తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ అనే పెద్ద మనిషి భట్టి విక్రమార్క టిఆర్ ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు. కాబోయే ముఖ్యమంత్రిని కాబట్టి పోలీసు వర్గాలు నాకీ విషయాన్ని వెల్లడించాయి.’ అని కెసిఆర్ తనలోనే చాలా కాలంగా దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టారు.
ఇలాంటపుడు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొదట ఫోన్లో తర్వాత వ్యక్తిగతంగా కలసి ఈ కుట్ర గురించి చెప్పాడని ముఖ్యమంత్రి చెప్పారు.
’నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుని తెలంగాణాలో రాష్ట్రపతి పాలన వచ్చేందుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేశాయి. అపుడు నాకు అండగా నిలిచింది ఎంఐఎం’ అని ఆయన ఎంఐఎం తో తన అనుబంధ అసాధాణమయిందని చెప్పేందుకు ప్రయత్నించారు.
ఈ విషయాన్నిప్రస్తావిస్తూ కెసిఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎప్పుడు, ఎలా కుట్ర జరిగిందో వెల్లడించాలని, కుట్రను ఎవరు, ఎందుకు చేశారో కేసీఆర్ స్పష్టం చేయాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగితే ఎంఐఎం తమను ఆదుకుందని కేసీఆర్ చెబుతున్నారని, ఈ కుట్ర టీఆర్‌ఎస్‌లోనుంచే జరిగిం దా లేక ఇతర పార్టీలు చేశాయా అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపైనా లేదా అని ప్రశ్నించారు.
’ప్రభుత్వంపై కుట్ర జరిగిందో లేదో కానీ మిగతా పార్టీలపట్ల టీఆర్‌ఎస్ కుట్ర చేసింది మాత్రం నూటికి పాళ్లు నిజం.’ అని కిషన్ ఖరాకండిగా చెప్పారు.
’బీఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడం అంటే ఏమిటి? ఇది కుట్రకాదా? ఎంఐఎంను నెత్తికెక్కిచ్చుకునేందుకు ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోయడం ఎందుకు? అంతగా మోజుంటే, ఎంఐఎం ఆఫీసులో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని, టీఆర్‌ఎస్ భవన్‌లో ఎంఐఎం బ్రాంచిని పెట్టుకోవచ్చు. అవినీతి, నేర రాజకీచయ సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకునేందుకే ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే,’ అయన అన్నారు.
తెలంగాణా ఏర్పాటును ఎపుడు సమర్థించని ఎంఐఎంతో ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి కెసిఆర్ స్నేహం చేస్తారో, ఆ పార్టీని ఎందుకు అంత మిత్రపక్షంగాప్రమేస్తున్నారో ప్రజలకు కూడా చెబితె సంతోషిస్తారని యన అన్నారు.
