ఆగస్టు 28 న ముఖ్యమంత్రి నాయుడు రెయిన్ గన్ తో కరువు మీద యుధ్దం ప్రకటించిందిక్కడి నుంచే రెన్నెళ్లు గడిచాయి. రెయిన్ గన్ తో కరువును జయించాని చెప్పి ముఖ్యమంత్రి వెళ్లి పోయారు ఇపుడిదీ దయనీయ పరిస్థితి.
ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎండిపోయిన వేరు శనగ పంట.. కాదు.
పేద రైతు శోకం, కన్నీళ్లు..... వాటికింద కనిపించకుండా దాక్కున్న రాజకీయం,
అక్టోబర్ 18 వ తెదీన తీసిన ఫోటో ఇది. ఈ భూమి అనంతపురం జిల్లా ఆమడగూరు మండలం, గుండువారిపల్లెకి చెందిన రైతు శివన్నది. ఈ పంట ఎండిపోయింది. పంట మీద పెట్టిన పెట్టుబడి పోయింది. శివన్నకు అప్పుమిగిలింది. ఇలాంటి శోక గీతాలు అనంతపురం జిల్లాలో అడుగడుగునా వినబడుతాయి. ఇందులో విశేషమేమీ లేదు.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్ల ఈ పంట భూమి చరిత్ర కెక్కింది.

ఆగస్టు 28వ తేదీన, కరువు మీద యుద్ధం ప్రకటించేందుకు, కరువుజయించేందుకు ముఖ్యమంత్రి జైత్ర యాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. తాను ఈ ఏడాదే కనుగొన్న బోఫోర్స్ గన్ వంటి ’ రెయిన్ గన్’ భుజానేసుకుని ఈ భూమిలో కాలుమోపి, పక్కనున్న గోతిలోనిలువ వున్న నీటిని రెయిన్ గన్ ఈ భూమ్మీద చిలకరించి, కరువెళ్లిపోయింది, కరువు ను తరిమేశాం అని ప్రకటించి వెళ్లిపోయారు. రెయిన్ గన్ సహాయంతో లక్షలాది ఎకరాలలో పంటను కాపాడామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ లక్షలాది ఎకరాలలో శివన్న చెలక కూడా ఉంది. ఈ పోటోలో ఉన్నది కరువు బారి నుంచిబయటపడినట్లు చెబుతున్న భూమి. పై ఫోటో ఆగస్టు 28 న ముఖ్యమంత్రి పర్యటన నాటిది.
ఆమడగూరే కాదు, రాష్ట్రమంతా ఇలాంటి మోసమో జరిగిందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు సి. రామచంద్రయ్య వ్యఖ్యానించారు. ’ రెయిన్ గన్ లు, డ్రోన్ లు అన్ని చంద్రబాబు నాయుడు కమిషన్ వ్యపారంలో భాగమే. అదేమీ కొత్త కాదు. సినిమా వాళ్లు వాన కురిపించేందుకు వాడే పరికరమే. మా చిన్నపుడు రంగులు చల్లుకునేందుకే ఇలాంటి పిచికారియే వాడాం. ఒక సారి పంట బతకాలంటే,కనీసం రెండు సెంటిమీటర్ల లోతు దాకా భూమి తడ్సాలి. ఈ రెయినగన్తో అదిసాధ్యమే కాదు. ఆయన వచ్చి రెయిన్ గన్ ప్రయోగం రాత్రిరాత్రికి అదికారులు సృష్టించిన మోసం. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడా రెయిన్ గన్లు వాడారో అక్కడంతా వెళ్లి చూడండి . ఈ శివన్న పరిస్థితే కనిపిస్తుంది,’ అని రామచంద్రయ్యం చెప్పారు.
