ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రి పదవులు దక్కేనా ఫిరాయింపు ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యాఖ్యలు చేసాారా? ఎటూ తేల్చుకోలేక పోతున్న చంద్రబాబు
ఫిరాయింపు శాసనసభ్యులకు మంత్రి పదవులు ఎండమావులేనా? వైసీపి నుండి అధికార తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలను మంత్రిపదువుల విషయంలో దూరంగా పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇవ్వటాన్ని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అభ్యంతరాలు వ్యక్తం చేసారనే ప్రచారాన్ని తమ మద్దతుగా టిడిపి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.
దాంతో ఫిరాయింపు శాసనసభ్యులను మంత్రిపదవులకు దూరంగా ఉంచేందుకు చంద్రబాబు రంగం సిద్దం చేస్తున్నారా అన్న అనుమానాలు సర్వత్రా మొదలైంది. దాంతో మంత్రిపదవులను హామీగా పొంది వైసీపీ నుండి అధికార తెలుగుదేశంలోకి చేరిలో శాసనసభ్యుల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది.
దానికితోడు గత కొద్ది రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే జవాబు కూడా అవుననే వినిపిస్తోంది. మొదట్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఇపుడు చాలా వరకూ దూరంగా పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకాండా చేసే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుండి ఇప్పటి వరకూ సుమారు 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్నారు. వీరిలో అత్యధికులకు మంత్రిపదవులు, కాంట్రాక్టులు తదితర ప్రలోభాలను ఎరగా వేసి ఫిరాయింపులను ప్రోత్సహించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో నమ్మకంగా ఉన్న ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ తదితరులను ఈ విధంగానే చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకున్నారన్న ప్రచరం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, ఫిరాయించిన ఎంఎల్ఏలంతా ఒక్క సారిగా కాకుండా విడతల వారీగా టిడిపిలోకి చేరారు. ఇంకా చేరేవారు ఉన్నారని టిడిపి వర్గాలంటున్నాయి.
వీరంతా వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చి దాదాపు ఏడాదికి పైగా అయిపోయింది. అప్పటి నుండి మంత్రి పదవులనే ఆశగా చూపిస్తూ చంద్రబాబు వారిలో అత్యధికులకు ఊరడిస్తున్నారు. ఒకవైపు కాలం గడచిపోతోంది. ఇంకో వైపు మంత్రి పదవులు రావటంలేదు. దాంతో చంద్రబాబును నమ్మి వైసీపీలో నుండి టిడిపిలోకి వచ్చిన వారిలో కొందరు చంద్రబాబుపై మండిపడుతున్నారు.
పార్టీ ఫిరాయించిన వారిలో భూమా, జ్యోతుల, జలీల్ ఖాన్ లాంటి వారు మంత్రిపదవులపై హామీని పొందిన తర్వాతే గోడ దూకినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తుండటంతో ఫిరాయింపు శాసనసభ్యుల్లో అసహనం పేరుకుపోతోంది.
దానికితోడు మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికి చాలా ముహూర్తాలు వచ్చాయి, వెళ్ళాయి. ఒకసారి చంద్రబాబు కూడా మాట్లాడుతూ, దసరా పండుగా సందర్భంగా మంత్రివర్గంలో మార్పలుంటాయని స్పష్టంగా చెప్పారు. దాంతో మంత్రిపదవులపై పలువురిలో ఆశలు పెరిగిపోయాయి.
ఇంతలో ఫిరాయింపుల ఎంఎల్ఏలకు మంత్రిపదువులు ఇవ్వటంపై గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం మొదలైంది. దాంతో ఫిరాయింపు శాసనసభ్యుల్లో మంత్రి పదువులపై హమీతో వచ్చిన వారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రి పదవులను ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోని కారణంగానే మంత్రివర్గ విస్తరణ కానీ ప్రక్షాళనలో గానీ జాప్యం జరుగుతోందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
