ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి ప్రతిపక్ష వైఎస్ఆర్  కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నతరుణంలో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఆయన కుమారుడు  నారా లోకేశ్ మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తులను గుంటూరులో ప్రకటించారు. చంద్రబాబు ది అయిదుగురు సభ్యులున్న చిన్న కుటుంబం. కుటుంబ ఆస్తుల వివరాల ప్రకారం, ముఖ్యమంత్రిగా మూడు దఫాలుగా ఉన్నా రాజకీయాలలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న తాతకంటే మనవడు దేవాన్ష్ యే ధనవంతుడు. మార్కెట్లోకి  ఎన్ని విదేశీ కార్లొచ్చిన తన నిరాడంబరతను ఆయన వదులుకోలేదు. ఇంకా పాత అంబాసిడర్ కార్ వోనర్ గానే కొనసాగుతున్నారు. ఆయన ఆ కారులో తిరుగుతుండగా చూసిన వారెవరూ లేకపోవడం వేరేవిషయం.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తి రూ. 3.73 కోట్లు అప్పేమో రూ. 3.06 కోట్ల.  చంద్రబాబు నాయుడు పేరు మీద జూబ్లీహిల్స్‌లో రూ. 3.68 కోట్ల విలువైన ఇంటి స్థలం, 1.52 లక్షల రుపాయలు విలువ చేసే పాత అంబాసిడర్ కారు ఉన్నట్లు లోకేశ్ చెప్పారు. చంద్రబాబు ఆస్తుల మిగులు రూ. 67.04 లక్షలు మాత్రమే అని ఆయన తెలిపారు.

పూర్తి వివరాలివి:

చంద్రబాబు నాయుడు నికర ఆస్తి విలువ రూ. 3 కోట్ల 73 లక్షలు
ప్రస్తుత ఆస్తులు రూ. 67 లక్షలు
బ్యాంకు రుణం రూ. 3 కోట్ల 6 లక్షలు
బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు రూ. 3లక్షల 59 వేలు
అంబాసిడర్ కారు విలువ రూ. లక్షా 52 వేలు

నారా భువనేశ్వరి మొత్తం ఆస్తి రూ. 38 కోట్ల 66 లక్షలు
అప్పులు రూ. 13 కోట్లు
నికర ఆస్తులు రూ. 24 కోట్లు 84 లక్షలు
పంజాగుట్ట స్థలం విలువ రూ. 73 లక్షలు
మదీనాగూడలో స్థలం విలువ రూ. 73 లక్షలు
తమిళనాడులో స్థలం విలువ రూ. కోటి 86 లక్షలు
హెరిటేజ్ లో వాటా విలువ రూ. 19 కోట్ల 93 లక్షలు
వివిధ కంపెనీల్లో వాటా విలువ రూ. 3 కోట్ల 29 లక్షలు
వాహనాల విలువ రూ. 91 లక్షలు
పీఎఫ్‌ ఖాతాలో రూ. కోటి 73 లక్షలు

నారా లోకేశ్ మొత్తం ఆస్తి విలువ రూ. 14 కోట్ల 50 లక్షలు
నికర ఆస్తులు రూ. 8 కోట్ల 15 లక్షలు
కారు విలువ రూ. 92 లక్షలు
అప్పులు రూ. 6 కోట్ల 35 లక్షలు

బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ రూ. 12 కోట్ల 75 లక్షలు
నికర ఆస్తులు రూ. 12 కోట్లు 33 లక్షలు
అప్పులు రూ. 42 లక్షలు
మాదాపూర్ లో స్థలం విలువ రూ. 17 లక్షలు
జూబ్లిహిల్స్ లో ఇంటి విలువ రూ. 3 కోట్ల 50 లక్షలు
హెరిటేజ్ లో వాటా విలువ రూ.78 లక్షలు
బంగారు ఆభరణాల విలువ రూ. 15 లక్షలు
పీఎఫ్ ఖాతాలో రూ. 19 లక్షలు
నగదు నిల్వ రూ. 25 లక్షలు

నారా దేవాన్ష్ మొత్తం ఆస్తి రూ. 11 కోట్ల 32 లక్షలు
ఫిక్సెడ్ డిపాజిట్ రూ. 2 కోట్ల 4 లక్షలు
దేవాన్ష్ పేరిట ఇంటి విలువ రూ. 9 కోట్ల 17 లక్షలు
నగదు నిల్వ రూ. 2 లక్షల 31 వేలు