మెరుగుపడుతున్న జయ ఆరోగ్యం ప్రముఖుల పరామర్శలు 10 రోజుల్లో డిస్చార్జ్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుండి పది రోజుల్లో డిస్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రికి ప్రముఖుల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అమ్మ ఆరోగ్య మెరుగుపడుతున్న కారణంగా జయను పరామర్శించటానికి ప్రముఖులను అనుమతిస్తుండటంతో ఇటు పార్టీ వర్గాల్లోనూ అటు ప్రజల్లోనూ ఇంత కాలం జయ ఆరోగ్యంపై నెలకొన్న సందిగ్దత తొలగిపోతోంది. ఇందులో భాగంగానే శనివారం ఏపి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపిలు సిఎం రమేష్, మురళీ మోహన్ ఆసుపత్రికి వెళ్లి జయలిలతను పరామర్శించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 నెల రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చికిత్స నిమ్మితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి మొన్నటి వరకూ ఎవరినీ అమ్మను చూడటానికి అనుమతించలేదు. సుమారు నెల రోజుల పాటు జయ అరోగ్య పరిస్ధతిపై ఎవరికి తోచిన భాష్యాలను వారు చెప్పుకున్నారు. అందుకు ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వంలోని ఉన్నత స్ధాయి వర్గాలు కూడా దోహదం చేసాయి.

అటువంటి సమయంలో రెండు రోజుల క్రితం నుండి జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తరచూ ప్రత్యేక బులెటిన్లు విడుదల చేయటం మొదలుపెట్టాయి. దాంతో అందరికీ జయ ఆరోగ్యం మెరుగుపడటంపై నమ్మకాలు ఏర్పడుతున్నాయి. శనివారం ఉదయం జయను పరామర్శించిన తరువాత సుజనా మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్యం 95 శాతం మెరుగుపడినట్లు వైద్యులు తమతో చెప్పినట్లు చెప్పారు. మరో పది రోజుల్లో జయ ఆసుపత్రి నుండి డిస్చార్జ్ కూడా అవుతారన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో జయలలిత పోయిన నెల 22వ తేదీన ఆసుపత్రిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అమ్మ చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు లండన్, సింగపూర్ నుండి కూడా వైద్య నిపుణులను పిలిపించి అత్యున్నత వైద్యాన్ని అందించారు. దాంతో జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అయినప్పటికీ కొంత కాలం పాటు జయకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు సూచించారు. దాంతో మరి కొంత కాలం పాటు జయ నివసమైన పొయెస్ గార్డెన్ కే పరిమితమవ్వక తప్పదు.