ప్రత్యేక హోదాపై యువజన సమీకరణకు జగన్ పిలుపు సిఎం ప్రత్యేక ప్యాకేజీ క్యాంపెయినకు కౌంటర్ గా ప్రత్యేక హోదా క్యాంపెయిన్ ఉధృతం కానున్న ప్రత్యేక హోదా సమరం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు యువకులను సమీకరించే నిమిత్తొ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ యువభేరీ ప్రారంభిస్తున్నారు.
ఈ నెల 25 ఆయన కర్నూల్ జిల్లాయువకులువిద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక సహాయ మూట (స్పెషల్ ప్యాకేజీ) ప్రకటించాక జరుగుతున్న యువజన సమావేశం ఇదే. ఈ వరాల మూట అందించాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వల్ల పెద్ద ప్రయోజనం లేదని, అంతకంటే, కేంద్ర సహాయ మూటలోనే ఎక్కువ లాభాలున్నాయని అనడం మొదలుపెట్టారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు మాటలకు యువత లోనుకాకుండా ఉండేందుకు మళ్లీ యువభేరి ప్రారంభించి, మూట విప్పి అందులో ఏమీ లేవనే చెప్పేందుకు జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు జగన్ ఇలాంటి సమావేశాలను, తిరుపతి, విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు తదితర పట్టణాలలో ఏర్పాటుచేశారు. యువకుల ఆంధ్రలో ఎందుకు ఉద్యోగాలు రావడంలేదు చెబుతూ కార్యాచరణకు సన్నద్ధం చేయడం ఈ యువభేరి ఉద్దేశం.
ప్రత్యేక హోదా వదిలేసి ప్రత్యేక సాయం మూట కోసం తెలుగుదేశం పార్టీ ఎందుకు వెంపర్లాడుతున్నదో ఈ సమావేశంలో యువకులకు తెలియచేస్తారు. ఇదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ వచ్చాక, ఒక వైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు వెంకయ్య నాయుడు ఈ ప్యాకేజీ గొప్పతనం చెబుతూ అభినందనల సభలతోనో మారొక కార్యక్రమంతోనో వూరూర తిరుగుతున్నసంగతి తెలిసిందే.అయితే, తాను ప్రత్యేక హోదా విషయం వదలుకోలేదని చెప్పేందుకు జగన్ ఈ మద్య నెల్లూరు వెళ్లి బారా షహీద్ దర్గా దగ్గిర రొట్టెలుకూడా స్వీకరించారు. తర్వాత ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలన్నా ఇది అవసరమని ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, ఐజయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
