ప్రజలే చంద్రబాబుకు హై కమాండ్ అటచెవిలో పువ్వు
ప్రజల చెవిలో చంద్రబాబునాయడు పువ్వులు పెడుతున్నారు. ప్రజలే తనకు హైకమాండ్ అని వారి కంటే తనకు ఎవరూ ముఖ్యం కాదని ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలే తనకు హై కమాండ్ అని చెబుతున్నపుడు ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయటంలేదని పలువురు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
విభజన చట్టంలో రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా చంద్రబాబు ఎందుకు సహిస్తున్నారన్న సందేహం ప్రజలను పట్టి పీడిస్తోంది. నిజంగా ప్రజలే చంద్రబాబుకు హైకమాండ్ అయితే రాష్ట్రాభివృద్దికి బ్రేకులు వేస్తున్న కేంద్రానికి ఎందుకు అంతలా సాగిలపడుతున్నట్లో అర్దం కావటం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
