చంద్రబాబులో కలవరం కనబడుతోంది పార్టీ నేతలపై అసహనం
చంద్రబాబులో ఎందుకీ కలవర పాటు. మంత్రుల పనితీరు మెరుగు పరుచుకోమని, నేతల ఇసుక దందాలు మానుకోవాలని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించటం పార్టీలో చర్చనీయంశమైంది. మంగళవారం ఉదయం జరిగిన పార్టీ నేతల సమన్వయ సమవేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హెచ్చరికలపై పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
మంత్రివర్గంలో మార్పలు జరుగుతాయని చర్చ జరుగుతున్న నేపధ్యంలో, సమీప భవిష్యత్తులో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సిఎం ఈ హెచ్చరికలు చేసివుంటారని అనుకుంటున్నారు.
మున్పిపల్ ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు అనుకున్నంత సులువు కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దానికి తోడు వివిధ మార్గాల్లో చంద్రబాబు చేయిస్తున్న సర్వేలు కూడా ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. దాంతో ఎప్పటి నుండో పేరుకుపోయిన తన అసహనాన్ని చంద్రబాబు పార్టీ సమన్వయ సమావేశంలో వెళ్ళ గక్కినట్లు సీనియర్ నేతలు అనుమానిస్తున్నారు.
