Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయం  మిసైల్ ఫ్రూఫ్

  • ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి  మిసైల్ ఫ్రూఫ్ గోడలు
  • బుల్లెట్ ప్రూప్ అద్దాలు, బుల్లెట్ ప్రూా ఫ్ కార్లు, జడ్ ప్లస్  భద్రత
  • మరి బ్యాలెట్  దెబ్బను తప్పించునే  ఏర్పాటేమిటి

 

AP  CMO is missile proof

నిప్పులాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఎవరూ ప్రకటించనన్ని యుద్ధాలు  ప్రకటించారు. మొదట ఆయన  కరువు మీద యుద్ధం ప్రకటించారు. దీనికోసం బోఫోర్స్ గన్ లాగా తన రెయిన్ గన్ ప్రయోగించారు. కొన్ని వేల రెయిన్ గన్లను రంగంలోకి దించి కరువును తరిమేశానని ఆయన  ప్రకటించారు. తర్వాత దోమల  మీద యుధ్దం ప్రకటించారు. ఈ యుద్ధంకొనసాగుతూ ఉన్నట్లుంది. ఎందుకంటే, దోమలను నిర్మూలించామని ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.  ఇంకా చాలా సమస్యల మీద యుద్ధాలు ప్రకటించాల్సి ఉందని తెలిసినోళ్లు చెబుతున్నారు.

అయినా, ఆయన యుధ్దాలు ప్రకటించడమేమిటి? ఎపుడూ యుధ్ద వీరుడిలాగా అస్త్ర శస్త్రాల పహారాలో జైత్రయాత్ర కెళుతున్నట్లు ఉంటుంది.ఆయనకు జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉంది. కమెండోల  కాపలా ఉంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల రక్షణ వుంది. అతను  అడుగేస్తే యుధ్దానికే.

 

నిజంగానే యుధ్దమొస్తే... ఒక వేళ యుద్ధం రాకపోయినా, తీవ్రవాదులో మరొకరో యుద్ధంలో లాగా దాడిచేస్తే ఎలా ఉండాలో కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుంది.

ఇపుడు వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సెక్రెటేరియట్ బిల్డింగ్ లోని తన కార్యాలయన్ని యుద్ధదాడి వచ్చినా తట్టుకుని నిలబడిగేంత శక్తి వంతంగా నిర్మించారని విశ్వసనీయంగా చెబుతున్నారు.

ఒక అధికారి చెప్పిందాని ప్రకారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాయలం గోడలు ఎంత పకడ్బందిగా  నిర్మించారంటే, క్షిపణి దాడి జరిగినా అందులో వీడియో కాన్ఫరెన్సలో ఉన్న ముఖ్యమంత్రికి ఎలాంటి హానిజరగదట.

ఇంతవరకు వెలగపూడి సచివాలయం తయారువుతూ ఉంది, అన్ని అత్యాధునిక వసతులతో దేశంలో ఏ రాష్ట్ర సెక్రెటేరియట్ కూడా ఉండనంత ఫ్యాషనబుల్ గా ఉంటుందని పత్రికలు తెగ రాశాయి. ముఖ్యమంత్రి పూజ చేసిన దసరా నాడు కార్యాలయంలో అడుగుపెట్టిన సందర్భాన్నిచక్కటి ఫోటోలతో రాష్ట్ర ప్రజలకు చూపారు. అయితే,  సిఎం గారి కార్యాలయంలో ఉన్న సౌకర్యాలెలాంటివి, అక్కడ ఉన్న రక్షణ ఏర్పాట్లు ఎలా గున్నాయనే విషయాలింకా బయటకు పొక్కినట్లు లేవు.

 ముఖ్యమంత్రి చాలా దేశాలలో పర్యటించి, అక్కడి అధికార కేంద్ర భవనాలను, కార్పొరేట్ కార్యాలయాల నిర్మాణాలను వసతులను చూసి, తన కార్యాలయం ఎలా ఉండాలో తానే స్వయంగా దగ్గరుండి రూపొందించుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

అక్షరాల  ఆయన కార్యాలయం   ఇన్వెస్టర్లు తప్ప మరొకరెరూ సులభంగా ప్రవేశించలేనంత దుర్బేధ్యం గా రూపొందించారు. యాభై వేల కంటే ఎక్కవ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న  ముఖ్యమంత్రి కార్యాలయం ప్రపంచ స్థాయిలోనే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అందువల్ల లోపలంతా ఇటాలియన్ మార్బుల్ నే వినియోగించారట.

ఆయన జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న నేత కాబట్టి కార్యాయలయానికి వాడిన అద్దాలన్నీ బుల్లెట్ ప్రూఫ్ వే.  ఆయన కార్యాలయానికి చేరుకోవడానికి ఏడు లిఫ్ట్ లున్నాయి. ఇందులో ఒకటి ముఖ్యమంత్రికి ప్రత్యేకించారు. “ఇవన్నీ ఒక ఎత్తు. కార్యాయలం గోడలు ఒక ఎత్తు. క్షపణి దాడి జరిగినా చెక్కచెదరని రీతిలో కాంక్రీట్ వాడారు. ఇండియాలో ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత కట్టుదిట్టమయిన రక్షణతో తయారు కావడం ఇదే,” ఆ అధికారి ఒకరు చెప్పారు.

చైనా, మలేషియా, సింగపూర్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలలో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడి అధికార నివాసాలను, కార్పొ రేట్ భవనాలను సునిశితంగా పరిశీలించారు. అక్కడి నిపుణులతో మాట్లాడారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన స్వయంగా తన కార్యాలయానికి రూపకల్పన చేశారు,”  ఆయన చెప్పారు. ఆయన గది, సమావేశపు గది, డైనింగ్ హాల్ అన్నీ ప్రపంచస్థాయిలోనే ఉన్నాయట.

బుల్లెట్ ప్రూఫ్ కారు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, మిసైల్ ప్రూఫ్ గోడులు, డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రం, మస్కిటో రిపెల్లెంట్ ఆంధ్రప్రదేశ్... అన్ని బాగున్నాయి. అయితే, ఆయన ఒక విషయం మర్చిపోయినట్లుంది,  బ్యాలెట్ ఫ్రూప్  తెలుగుదేశం ప్రభుత్వం గురించి కూడా ఆయన ఆలోచించాల్సి ఉంది.  బుల్లెట్, మిసైల్ కంటే, శక్తి వంతమయింది బ్యాలెట్.  బ్యాలెట్ దెబ్బతగలకుండా తెలుగుదేశం పార్టీని బ్యాలెట్ ప్రూఫ్ చేయగలరా? బుల్లెట్ ప్రూఫ్ ఇపుడేం అంత పెద్ద విషయం కాదు, ఇపుడు  పార్టీల నేతలకు, అందునా అధికారంలో ఉన్న నేతలకు అందరికి బుల్లెట్ ఫ్రూఫ్ రక్షణ ఉంది.  తక్షణం కావలసింది బ్యాలెట్ ఫ్రూప్ వెస్ట్, అధికారం.ఇంకా  ఈ విషయం  గురించి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ప్రకటించ లేదు. చూద్దాం . ఇంకా చాలా  టైముంది కదా.

 

Follow Us:
Download App:
  • android
  • ios