హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణాలో ఆంధ్రోళ్లకు శాశ్వత చిరునామా సెక్రెటేరియట్ అప్పగించేందుకు జాగా కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ లో ఆంధ్రోళ్ల కాలనీలు చాలా ఉండొచ్చు లేదా చాలా కాలనీలలో ఆంధ్రోళ్లుండవవచ్చు. ఇంతవరకు హైదరాబాద్ లో ఆంధ్రోళ్ల కొక ప్రత్యేక అడ్రసంటూ లేకుండా పోయింది. ఎక్కడచూసిన ఆంధ్రోళ్లే, రాష్ట్రమూ అంధ్రప్రదేశ్ కాబట్టి ఆ అవసరమూరాలేదు. రాజధానిని హడావిడిగా అమరావతి కి మార్చేశాక హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ వశమయ్యే దశలో ఏదో వెళితి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి కనిపించి బాధిస్తున్నట్లుంది. ఎందుకంటే, హైదరాబాద్ లో ఆంధప్రదేశ్ ఉనికి గుర్తుచేసే ప్రదేశాలు రెండే ఉండేవి. అందులో ఒకటి ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ , రెండో ది తెలుగుదేశం పార్టీ.
ఇపుడూ ఈ రెండు హైదరాబాద్ నుంచి దాటుకున్నాయి. తెలుగుదేశం ఆఫీసు గుంటూరుకు, సెక్రెటేరియట్ వెలగపూడికి వెళ్లిపోయాయి. ఇక అక్కడక్కడ మిగిలిన విగ్రహాలు, కొన్ని పార్క్ ల పేర్లు తప్ప హదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ను గుర్తుచేస్తూ, ఆంధ్రోళ్లంతా పండగకో పబ్బానికో కలసి కబుర్లు చెప్పుకునేందుకు ఒక నెలవంటూ లేకుండా పోతున్నది. ఒక అడ్రసంటూ ఉంటే రాష్ట్రావతరణకో సంక్రాంతికో, కాకుంటే ఉగాదికో పండగ చేసుకోవచ్చు, కరీపాయింట్స్ పెట్టుకోవచ్చు, అవసరమయితే, కోడిపందాల వంటి సాంస్కృతిక కార్య క్రమాలాడుకోవచ్చు.
ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ భవన్ చూడండి- నవంబర్ 1 తేదీన ఆంధ్రావాళ్లంతా కలసి రాష్రావతరణ జరుపుకుంటారు. ఆంద్రా ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ధియోటర్లో సినిమా ఆడించుకుంటారు. ఆంధ్రా మీల్స్ వడ్డించే చక్కటి క్యాంటీన్ కూడా ఉంది. ఫుడ్ కు తప్ప సాధారణ ఆంధ్రవాడికి ఎందుకూ కొరగాకపోయినా, ఆపీసర్లకు, పాలిటీషియన్స్ కు ఇది బాగా పనికొస్తుంది.
ఇక ముందు తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఆంధ్రాభవన్ అవసరమవుతందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలోచించడం చాలా హర్షించదగ్గది. ఎందుకంటే, హైదరాబాద్ తెలంగాణాకు పూర్తిగా బదిలీ అయినాకూడా, ముఖ్యమంత్రి మొదలుకుని రాజకీయనాయకులు, అధికారుల దాకా శాశ్వత చిరునామాలన్నీ హైదరాబాద్ లోనే ఉంటాయి. అందువల్ల వీళ్లందరు అపుడపుడొచ్చిసేద తీర్చుకునేందుకు వరల్డ్ క్లాస్ ఆంధ్రాభవన్ కావలసి ఉంది. అపుడది తెలంగాణా సముద్రంలో ఆంధ్రా ద్వీపంలాగా అదిరిపోతుంది. అంధ్ర పెద్ద లందరికి కొండంత అడ్రసులాగా మారుతుంది.
దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా క్విడ్ ప్రో క్వో మార్గం ఎంచుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న సెక్రెటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం అదుపులో ఉన్న భవనాలను వాపసు ఇచ్చేందుకు దానికి తగ్గట్టు ప్రధాన కూడలిలో ఖాళీ జాగా ఇవ్వాలని అడిగారు. ఎనిమిదేళ్ల హక్కులను వదులకోవడమంటే మాటలా. కొత్త సిఎంఒ, కొత్త సెక్రెటేరియట్ నిర్మాణాల తర్వాత హైదరాబాద్ నిర్మాతలెవరంటే, నిజాం, కెసిఆర్ అనే చెప్పే రోజులురాబోతున్నాయి. మరి ఆధునిక హైదరాబాద్ నిర్మాత అయిన చంద్రబాబు నాయుడిని గుర్తుకు తెచ్చుకునేదెలా?
అందుకే కెసిఆర్ ఇచ్చే జాగాలో ఒక వరల్డ్ క్లాస్ ఆంధ్రప్రదేశ్ భవన్ లేస్తుంది. ఈ నిర్ణయాన్ని టిడిపి పాలిట్ బ్యూరో తీసుకుంది. ప్రభత్వం ఒకె చేసేసింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిని తిరస్కరించగలరా? హైదరాబాద్ లో ఆంధ్ర సెంటిమెంట్ వ్యవహారం.
