చంద్రబాబుపై విపక్షాల ధ్వజం సింగపూర్తో కలిసి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ బుగ్గన ఆరోపణలు

చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. అందుకనే రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ జపం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ తో కలిసి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ధ్వజమెత్తుతున్నాయి. సింగపూర్ చేసే ప్లాట్ల వ్యాపరంలో చంద్రబాబు కూడా ప్రధాన భాగస్వామిగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

రైతుల వద్ద విలువైన భూములు తీసుకున్న చంద్రబాబు సింగపూర్ సంస్దలకు కట్టబెట్టటం ఏమిటని దుయ్య బడుతున్నాయి. అమరావతి ప్రాంతంలో మళిక సదుపాయాల కల్పనకు రూ. 15 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న ఏపి ప్రభుత్వానికి ఆదాయంలో 42 శాతం వాట దక్కగా కేవలం రూ. 300 కోట్లు పెట్టుబడి పెడుతున్న సింగపూర్ సంస్ధలకు 58 శాతం వాటా ఏమిటని ధ్వజమెత్తారు. భారతీయ కంపెనీలను కాదని సింగపూర్ కంపెనీలపై చంద్రబాబుకు ఎందుకు అంత మోజని తీవ్రంగా ప్రశ్నించాయి.

భారతీయ సంస్దలను గాడిదలతోనూ విదేశీ సంస్దలను గుర్రాలతోనూ పోల్చటం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికాయి. అసలు స్విస్ ఛాలెంజ్ విధానాన్నే న్యాయస్దానం తప్పు పట్టిన సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలని విపక్షాలంటున్నాయి. న్యాయస్ధానం తప్పపట్టిందన్న ఏకైక కారణంతోనే సింగపూర్ సంస్దలకు అనుగుణంగా చంద్రబాబు రాష్ట్ర చట్టాలనే మారుస్తున్నట్లు వైసీపీ ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. స్విస్ ఛాలెంజ్ విధానమే మొత్తం అనుమానాస్పదమన్నారు.