Asianet News TeluguAsianet News Telugu

ఉదయం పూట శృంగారం.. ఎన్ని లాభాలో తెలుసా?

జంటలు వారి సెక్స్ రొటీన్‌లో తాజాదనాన్ని అనుభవిస్తారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

Reasons why morning sex is much BETTER than sex at night ram
Author
First Published Mar 24, 2023, 12:13 PM IST | Last Updated Mar 24, 2023, 12:13 PM IST

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే... దానిని రసవత్తరంగా ఆస్వాదించడం  అందరికీ తెలియకపోవచ్చు. చాలా మంది శృంగారం అనగానే అది చీకటి వ్యవహారంగా... రాత్రిపూట మాత్రం చేసే కార్యంగా భావిస్తారు. కానీ... పని ఒత్తిడి, అలసట కారణంగా అందరూ రాత్రి కలయికను ఆస్వాదించే ఓపిక ఉండకపోవచ్చు. దాని వల్ల కలయిక పై అయిష్టత కలుగుతుంది. అదే... దాని స్థానంలో ఉదయపు శృంగారాన్ని అలవాటు చేసుకుంటే.. ఆనందపు చివరి అంచుల వరకు వెళ్లిరావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం శృంగారం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం..


పెరిగిన శక్తి

చాలా మంది వ్యక్తులు ఉదయం పూట మరింత శక్తిని అనుభవిస్తారు, ఇది మరింత ఆనందదాయకమైన లైంగిక అనుభవాలకు దారి తీస్తుంది. మంచి నిద్ర అలవాట్లకు ప్రాధాన్యతనిచ్చే వారికీ,  బాగా విశ్రాంతిగా మేల్కొనే వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. శక్తి(ఎనర్జీ) ఎక్కువగా ఉంటే సెక్స్ మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

 హార్మోన్ల మార్పులు

టెస్టోస్టెరాన్ స్థాయిలు తరచుగా పురుషులు , మహిళలు ఇద్దరికీ ఉదయాన్నే ఎక్కువగా ఉంటాయి, ఇది లిబిడో , లైంగిక కోరికను పెంచుతుంది. ఇద్దరు భాగస్వాములు ఉద్రేకానికి గురవుతారు. కలయి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది.

రిఫ్రెష్ అయిన అనుభూతి

మంచి రాత్రి నిద్ర తర్వాత, చాలా మంది వ్యక్తులు రిఫ్రెష్ , పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు, ఇది సానుకూల మానసిక స్థితిని సృష్టిస్తుంది. లైంగిక సాన్నిహిత్యాన్ని ఆస్వాదించే సంభావ్యతను పెంచుతుంది. జంటలు వారి సెక్స్ రొటీన్‌లో తాజాదనాన్ని అనుభవిస్తారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

కలిసి ఒంటరిగా గడిపడం..

దాదాపు ఈ రోజుల్లో జంటలకు ప్రశాంతమైన సమయం దొరకడం లేదు. రాత్రిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగం, వ్యాపార ఒత్తిడి మొత్తం ఇంటికి మోసుకువస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కలయికలో పాల్గొనాలనే కోరిక కూడా కలగదు. కానీ.. ఉదయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. పని మొదలు కావడానికి ముందే.. దంపతులు ఏకాంతంగా గడపడానికి కాస్త సమయం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

రోజును సరిగ్గా ప్రారంభిస్తారు..

మీరు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం ద్వారా రోజును ప్రారంభించినట్లయితే తప్పేమీ లేదు. అదనంగా, మీరు భావప్రాప్తి పొందినట్లయితే, మీరు చాలా సంతోషంగా, సానుకూలంగా , మంచి అనుభూతి చెందుతారు. ఈ వైబ్‌లు మీకు రోజును సరిగ్గా ప్రారంభించడంలో సహాయపడతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios