Asianet News TeluguAsianet News Telugu

సర్వే: పుదుచ్చేరిలో బీజేపీ- అన్నాడీఎంకే క్లీన్ స్వీప్.. కాంగ్రెస్- డీఎంకే పలాయనమే

ఇటీవల జరిగిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో ఈసారి ఎవరు అధికారాన్ని అందుకోబోతున్నారన్న దానిపై రెనాయ్‌స్సాన్స్ ఫౌండేషన్ అనే ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించింది.

Survey predicts Congress DMK  in Puducherry sweep for AIADMK BJP ksp
Author
Puducherry, First Published Mar 8, 2021, 9:18 PM IST

ఇటీవల జరిగిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో ఈసారి ఎవరు అధికారాన్ని అందుకోబోతున్నారన్న దానిపై రెనాయ్‌స్సాన్స్ ఫౌండేషన్ అనే ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించింది.

ఇందులో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి 23 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే అభిప్రాయపడింది. అయితే మరో సర్వేలో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి పుదుచ్చేరిని క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడైంది.

అయితే  రెనాయ్‌స్సాన్స్ ఫౌండేషన్ సర్వే ప్రకారం బీజేపీ- అన్నాడీఎంకే: 23, డీఎంకే- కాంగ్రెస్: 3, ఎన్ఆర్ కాంగ్రెస్ 1, ఇతరులు: 3 స్థానాన్ని గెలుచుకుంటారని తేలింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరిలో 25 శాతం ఓట్ల శాతాన్ని పొందే అవకాశం వుందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రెనాయ్‌స్సాన్స్ అభిప్రాయపడింది.

ఆ తర్వాత బీజేపీ (24), కాంగ్రెస్ (20), ఏఐఏడీఎంకే (21) శాతం ఓట్లను పొందుతాయని వెల్లడించింది. అయితే ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ఈ సర్వేలో ఎలాంటి అనుకూల వాతావరణం లేదని తేల్చిచెప్పింది.

ప్రస్తుతానికి ఎన్ఆర్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ కాంగ్రెస్- అన్నాడీఎంకే- బీజేపీ కూటమితో తర్వాతి దశల్లో చేతులు కలిపితే మాత్రం ఈ కూటమి బలం మరింత పెరుగుతుందని సదరు ఏజెన్సీ అభిప్రాయపడింది.

అప్పుడు బీజేపీ- అన్నాడీఎంకే- ఎన్ఆర్ కాంగ్రెస్‌: 28, డీఎంకే- కాంగ్రెస్: 1, ఇతరులు: 1 స్థానాన్ని గెలుచుకుంటారని తెలిపింది. ఈ ఫలితం పుదుచ్చేరిలో డీఎంకే- కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేస్తుందని రెనాయ్‌స్సాన్స్ అభిప్రాయపడింది.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీజేపీలు ఒంటరిగా పోటీ చేశారు. ఇందులో ఎన్ఆర్ కాంగ్రెస్ 8, ఏఐఏడీఎంకే 4 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి ఒక్క సీటు కూడా లభించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios