బీచ్ లో బికినీ వేసుకుందనే కారణంతో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. అదేంటి..? బీచ్ అనగానే ముందుగా అందరి కళ్ల ముందుకు కదిలేది బికినీ బామలే. మనదేశంలోని గోవాలాంటి బీచుల్లోనే చాలా మంది  యువతులు బికినీల్లో దర్శనిమస్తుంటారు. ఇక విదేశాల్లో అయితే...వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది... విదేశాల్లోని ఓ బీచ్ లో యువతి బికినీ వేసుకుందని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తైవాన్ కి చెందిన  లిన్ తుజ్ టింగ్(26) అనే  యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫిలప్పిన్స్ కి వచ్చింది. వీరిద్దరూ బొరాకే ద్వీపంలోని ప్యూకా బీచ్ సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో... యువతి తెలుపు రంగు బికినీ ధరించింది. అయితే... ఆ బికినీ మరీ చిన్నగా ఉండటంతే చూడటానికి అభ్యంతకరంగా ఉంది.

అలాంటి బికినీ వేసుకోవడం కరెక్ట్ కాదని ఆమెకు అప్పటికే హోటల్ యాజమాన్యం హెచ్చరించారు. అయితే... ఆమె వాళ్ల మాటలను ఖాతరు చేయలేదు. తాను ఆ బికినీ వేసుకుంటానని పట్టుపట్టింది. అదే బికినీ వేసుకొని బీచ్ కి వెళ్లింది.

తైవాన్‌ బీచ్‌‌లలో బికినీలు వేసుకొని తిరగడం సర్వసాధారణమే. ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు కూడా పర్యాటక రంగమే. కానీ, ఫిలిఫ్పైన్స్ దేశస్థుల వస్త్రధారణ సంప్రదాయంగా ఉంటుంది. ఇక్కడే తేడా వచ్చింది. ఆ తర్వాత రోజు కూడా ఆ యువతి అలాంటి బికినీతోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది.

ఆ బీచ్ లో అందంగా ఫోజులు ఇచ్చి ఫోటోలు కూడా దిగింది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు  చేయగా వైరల్ గా మారాయి.  ఇవి బొరాకే ఇంటర్‌ ఏజెన్సీ రిహాబిలిటేషన్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ (బీఐఏఎంఆర్‌జీ) దృష్టికి వచ్చాయి. దీంతో వారు సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. యువతి బస చేస్తున్నహోటల్ అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ ఆమెను అరెస్టు చేయడం గమనార్హం. అలాంటి బికినీ వేసుకున్నందుకు ఆమెకు రూ.3,500 జరిమానా కూడా విధించారు.