Asianet News TeluguAsianet News Telugu

న్యూస్ యాంకర్ కి కొడుకు తిప్పలు.. క్యూట్ వీడియో వైరల్

ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. వాతావరణ వివరాలు చెబుతోంది. ఇంకేముంది అక్కడికి ఆమె పది నెలల కుమారుడు వచ్చి ఆమె చంక ఎక్కేశాడు.

Toddler Interrupts Mom's Weather Report In Adorable Viral Video
Author
Hyderabad, First Published Jan 30, 2021, 9:43 AM IST

ఆమె ఓ న్యూస్ యాంకర్. టీవీలో వార్తలు చదవడం ఆమె పని. అయితే.. ఆమెకు పది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. వాడు కాస్త ఆమె పనిచేసే లొకేషన్ కి వెళ్లాడు. ఇంకేముంది.. వాడు ఆమె పనిని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె వాతావరణ వివరాలు చెబుతుంటే.. వాడు తుంటరి పనులు చేయడం మొదలుపెట్టాడు. కాగా.. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె టీవీ యాంకర్ కూడా ఇంట్లోనే వర్క్ లొకేషన్ ఏర్పాటు చేసుకొని.. వాతావరణ వివరాలు చెబుతోంది. ఇంకేముంది అక్కడికి ఆమె పది నెలల కుమారుడు వచ్చి ఆమె చంక ఎక్కేశాడు.

ఆమె న్యూస్ చెప్పనివ్వకుండా.. ఆటంకం కలిగించాడు. ఆమె కాళ్ల దగ్గరకు వచ్చి హగ్ ఇవ్వడం లాంటివి చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె వెంటనే చెప్పడం ఆపేసి వాడిని ఎత్తుకుంది.  తల్లి మీద వాడు చూపించిన ప్రేమ... అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఆ వీడియో టెలికాస్ట్ చేయలేదు కానీ.. దానికి సంబంధించిన బ్లూపర్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios