ఉదయాన్ని ఉరుకులు పరుగులతో లేవడం... తినీ తినకా ఆఫీసులకు పరిగెత్తడం. అక్కడ విశ్రాంతి అన్నది తెలీకుండా ఉద్యగం చేయడం... ఎప్పుడో రాత్రి వేళకు ఇంటికి చేరడం. దాదాపు నగరాల్లో ఉద్యోగాలు చేసే అందరి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంటుంది. సరే ఇంత కష్టపడ్డాం కదా జీతం ఏమైనా ఆశించిన స్థాయిలో వస్తుందా అంటే.. అదీ లేదు. చాలీ చాలని జీతాలను కంపెనీలు మన చేతుల్లో పెడుతుంటాయి.

అయితే....  ఎలాంటి కష్టం లేకుండా.. రూ.లక్షల్లో జీతం అందుకునే ఓ ఉద్యోగం ఉంది. స్వీడిష్ ఎక్స్ పెరిమెంటల్ ఆర్ట్ ప్రాజెక్టు అనే సంస్థ ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. నెలకు అక్షరాలా రూ.1.72లక్షల ను జీతంగా అందిస్తానంటోంది.

ఈ ఉద్యోగం పూర్తి వివరాల్లోకి వెళితే.... స్వీడన్ ప్రభుత్వంం గోథెన్ బర్గ్ లోని కోర్వ్సేగన్ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ ని నిర్మిస్తోంది. ఇందులో కేవలం ఒక్కే ఒక్క వ్యక్తికి ఉద్యోగం కేటాయిస్తుంది. ఆ ఉద్యోగంలో చేరితే చాలు పనేమీ చేయాల్సిన పనేలేదు. డ్యూటీకి వచ్చి స్టేడియంలోని గడియారం వద్ద ఉన్న బటన్ నిక్కాల్సి ఉంటుంది. అలా బటన్ నొక్కగానే... అక్కడ లైట్లు వెలుగుతాయి. అంతే మళ్లీ... ఇంటికి వెళ్లేటప్పుడు ఆ బటన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

మిగిలిన సమయంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. తినొచ్చు. నిద్రపోవచ్చు.. ఏమైనా చేసుకోవచ్చు. కానీ..డ్యూటీ అయిపోయాక మాత్రం లైట్లను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం ఆ వ్యక్తికి నచ్చినన్ని రోజులు చేసుకోవచ్చు.  వేరే ఉద్యోగం వచ్చినా... ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. లేదు... నాకు ఈ ఉద్యోగం చాలే అనుకుంటే... రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు కూడా ఈ ఉద్యోగాన్ని కొనసాగించొచ్చు.

కేవలం లక్షల్లో జీతం ఇవ్వడమే కాదు... ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులు, సెలవులు, రిటైర్ అయ్యాక పింఛన్ కూడా ఇస్తారు. ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇస్తున్నారంటే.. దీనిని ప్రత్యేకమైన కారణం కూడా ఒకటి ఉంది.  నూతనంగా నిర్మించే కోర్స్వేన్ రైల్వేస్టేషన్ లో అన్నింటికన్నా భిన్నంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాదు.. ఈ ఉద్యోగం చేయడానికి ఎలాంటి విద్యార్హత కూడా అవసరం లేదు. అంతేకాదు.. ప్రపంచంలో ఏమూలలో మీరు  ఉన్నా కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఈ రైల్వే స్టేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఒక వేళ పూర్తైతే ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అప్పుడు మీకు ఇష్టమైతే మీరు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చే ఉద్యోగం ప్రపంచంలో మరెక్కడా దొరకకపోవచ్చు.