యువతి ఫోన్ నెంబర్ కావాలంటూ మెసేజ్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన పోలీస్
ఆదివారం ఓమహిళ పూణే పోలీసులకు ఓ మెసేజ్ చేసింది. తనకు దనోరీ పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలని అడిగింది. ఆమె ప్రశ్నకు పూణే పోలీసులు వెంటనే స్పందించారు. ఆమె అడిగిన నెంబర్ ఇచ్చారు.
సోషల్ మీడియాకి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో ఎవరినైనా హీరో చేయాలన్నా... జీరో చేయాలన్నా... ఆ పవర్ సోషల్ మీడియాకు ఉంది. కేవలం రాత్రికి రాత్రే చాలా మంది స్టార్స్ గా ఎదుగుతున్నారు. దానికి కారణం కూడా సోషల్ మీడియానే. అందుకే.. యువత దీనిపట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. యువతను ఇంతలా ఆకట్టుకునే ఈ సోషల్ మీడియాపై పోలీసులు, ప్రభుత్వాలు కూడా ఈ మధ్య ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
చాలా మంది పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నవారు ఉన్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు పోలీసులు అన్నివేళలా అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే... ఓ ఆకతాయి పోలీసుల ముందే కుప్పి గంతులు వేయాలని అనుకున్నాడు. పోలీసులకు సెటైర్ వేస్తున్నా అనుకొని అడ్డంగా బుక్కయ్యాడు. ఓ యువతి ఫోన్ నెంబర్ కోసం పోలీసులకే మెసేజ్ చేశాడు. ఆ ఆకతాయికి పోలీసులు ఇచ్చిన సమాధానంతో అతని దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన పూణేలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం ఓమహిళ పూణే పోలీసులకు ఓ మెసేజ్ చేసింది. తనకు దనోరీ పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలని అడిగింది. ఆమె ప్రశ్నకు పూణే పోలీసులు వెంటనే స్పందించారు. ఆమె అడిగిన నెంబర్ ఇచ్చారు.
Also Read శర్వానంద్ మహానుభావుడు సీన్ రిపీట్.. భర్తకు భార్య విడాకులు...
ఇంతలో ఓ ఆకతాయి.. తనకు సదరు మెసేజ్ చేసిన అమ్మాయి నెంబర్ కావాలి... ఇస్తారా అంటూ ట్వీట్ చేశాడు. చీప్ గా ట్వీట్ చేయడంతోపాటు.. పోలీసులనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడా అంటూ అతనిని నెటిజన్లు విపరీతంగా విమర్శించారు.
అయితే... పూణే పోలసులు మాత్రం అతనికి దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చారు. ‘‘ సర్, మాకు ప్రస్తుతం నీ నెంబర్ మీద ఆసక్తి ఎక్కువగా ఉంది.. అమ్మాయిల ఫోన్ నెంబర్ల మీద మీకు అంత ఆసక్తి ఎందుకు ఉందో తెలుసుకోవాలని ఉంది.. ముందు మీ ఫోన్ నెంబర్ మాకు మెసేజ్ చేయండి.’’ అంటూ ట్వీట్ చేశారు.
పోలీసులు చేసిన ఆ ట్వీట్ కి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఆ ట్వీట్ కి 14వేల లైకులు రాగా... 3వేల రీట్వీట్లు వచ్చాయి. సరైన సమాధానం చెప్పారంటూ పలువురు మెసేజ్ లు చేస్తున్నారు. పోలీసుల్లో చాలా మంది మంచి వారు ఉన్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.