హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి భోజనం చేస్తుంటాం.  అప్పుడు సర్వీసింగ్ నచ్చితే... ఓ పదో, ఇవరై ఇస్తాం. మరీ ఎక్కువైతే ఓ రూ.100 ఇస్తారు. అంతేకానీ... కేవలం టిప్పు లక్షల్లో ఇస్తామా..? కానీ ఓ వ్యక్తి ఇచ్చాడు. ఏంటి టిప్పు రూ.లక్షన్నర ఇచ్చాడా.. అతనికేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా…? పిచ్చి కాదు... కానీ న్యూ ఇయర్ సందర్భంగా అతను ఆ టిప్పు ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికాలోని మిచిగాన్‌లో థండర్ బే రివర్ రెస్టారెంట్‌ కి ఒక కస్టమర్ వెళ్ళాడు. రెస్టారెంట్ లో తనకు నచ్చినవి ఆర్డర్ చేసుకున్నాడు. హాయి గా తినేసి బిల్ ఎంతో కట్టేశాడు.

బిల్ కట్టాడు బాగానే ఉంది కదా, అతనికి వెయిటర్ ఎవరు అంటే, ఆ రెస్టారెంట్ లో కొన్ని రోజుల క్రితం వెయిటర్ గా చేరిన డేనియల్ ఫ్రాంజోని అనే 31 ఏళ్ళ మహిళ. ఆమె ఆ జాబ్ లో జాయిన్ అయిన రెండో రోజే ఆ కస్టమర్ వచ్చాడు. ఈ సందర్భంగా టిప్ ఇచ్చేటప్పుడు అతను ఒక ఛాలెంజ్ ఫాలో అయ్యాడు. అంటే 2020 ఛాలెంజ్ అన్న మాట. న్యూఇయర్ కదా అందుకే అది ఫాలో అయ్యాడు.

టిప్ 2020 ఇచ్చి ఆ కస్టమర్ ని ఆశ్చర్యపరిచాడు. 2020 అంటే రూపాయిలు కాదు మాస్టారూ, డాలర్లు. అతను తిన్న బిల్ ఎంతో తెలుసా, కేవలం మన కరెన్సీలో 1650 రూపాయలే మరి. హ్యాపీ న్యూ ఇయర్, 2020 టిప్ ఛాలెంజ్ తో ఉన్న స్లిప్ తో ఆమెకు టిప్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె తర్వాత మేనేజర్ దగ్గరకు వెళ్లి ఇది నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పడంతో ఆమెకు అసలైన న్యూఇయర్ వచ్చింది. ఇంతకు ఎంతో తెలుసా మన కరెన్సీలో దాదాపు ఒక లక్షా 45 వేల రూపాయలు.